ఆర్ఆర్ఆర్ హిందీ రీమేక్: ఆలియా పాత్రలో క్రితిసనన్ అంటున్న ఏఐ
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఆస్కార్ ను ఒడిసి పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాపై చాట్ జీపీటీ కొన్ని విషయాలను వెల్లడి చేసింది. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో సంచలనంగా మారిన చాట్ జీపీటీని ఉపయోగిస్తూ వింత వింత సమాధానాలు రాబడుతున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే, అందులోని పాత్రల్లో ఎవరు నటిస్తే బాగుంటుందని చాట్ జీపీటిని అడిగారు. ఆ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు వెల్లడి చేసింది చాట్ జీపీటీ. ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ పాత్రలో బాళీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తే బాగుంటుందని, అంతకుముందు ఆయన నటించిన సినిమాల్లో విభిన్నంగా కనిపించారని చాట్ జీపీటీ తెలిపింది.
శ్రియా పాత్రలో దీపికా పదుకునే
కొమరం భీమ్ పాత్రలో విక్కీ కౌషల్, రాజ్ కుమార్ రావు చక్కగా సరిపోతారని చాట్ జీపీటీ తెలియజేసింది. వీరిద్దరిలో ఎవ్వరైనా, ఎన్టీఆర్ పోషించిన భీమ్ పాత్రకు న్యాయం చేస్తారని అంది. అలాగే, ఆలియా పాత్రలో అందాల భామలు క్రితిసనన్, శ్రద్ధా కపూర్ లు బాగుంటారని అంది. శ్రియా శరణ్ కనిపించిన పాత్రలో దీపికా పదుకునే అయితే సెట్ అవుతుందని, అజయ్ దేవగణ్ చేసిన పాత్రకు సంజయ్ దత్ లేదా అనిల్ కపూర్ న్యాయం చేయగలరని చాట్ జీపీట్ తెలిపింది. ఇక చివరగా, ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ దాకా తీసుకెళ్ళిన రాజమౌళి స్థానంలో సంజయ్ లీలా భన్సాలీ చేస్తే బాగుంటుందని, ఆయనైతే సినిమాని సరిగ్గా హ్యాండిల్ చేయగలరని చాట్ జీపీటీ వెల్లడి చేసింది.