'Chennai Love Story' Movie Review: 'చెన్నై లవ్‌స్టోరీ' మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడిందా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమకథలు తెలుగు తెరపై ఎన్నో వచ్చినా.. వాటిని కొత్త కోణంలో చూపించగలిగితే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అదే నమ్మకంతో 'బేబీస సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డు అందుకున్న సాయిరాజేష్ కథను అందించగా.. ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించిన చిత్రం 'చెన్నై లవ్‌స్టోరీస. ఇందులో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. విడుదలకు ముందే కల్ట్ బ్లాక్‌బస్టర్ అనే ట్యాగ్‌తో ఆసక్తి రేపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
వివరాలు
కథ
నివి (శ్రీ గౌరీ ప్రియ) మూడేళ్లుగా ప్రేమించిన అజయ్ (త్రిగుణ్)ను పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని కలలు కంటుంది.
కానీ పెళ్లి ముహూర్తానికే అజయ్.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి బ్రేకప్ చెప్పి బెంగళూరుకు వెళ్లిపోతాడు.
ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన నివి.. ఆ బాధను మర్చిపోవడానికి స్నేహితులతో కలిసి చెన్నైకి వెళ్తుంది. ఊరు మారినా మనసు మారకపోవడంతో ప్రేమ వైఫల్యాన్ని మరిచేందుకు మద్యం అలవాటు చేసుకుంటుంది.
ఇదే సమయంలో సినిమా దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అనాథ స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) నివి స్నేహితులు ఉంటున్న ఇంట్లో ఆశ్రయం పొందుతాడు.
వివరాలు
హీరో నటన అద్భుతం
ఇంట్లో అందరితో సరదాగా ఉండే స్టీవెన్ ప్రవర్తన మొదట నివికి విసుగును కలిగిస్తుంది.
కానీ క్రమంగా అతని మంచితనం, అమాయకత్వం ఆమెను ఆకర్షిస్తాయి. చివరకు స్టీవెన్‌ను ఇష్టపడటం మొదలుపెడుతుంది. మరోవైపు స్టీవెన్ మాత్రం నివిని దేవతలా ఆరాధిస్తుంటాడు.
ఒకరోజు నివి అకస్మాత్తుగా "మనం పెళ్లి చేసుకుందామా?" అని అడుగుతుంది. ఆ తర్వాత స్టీవెన్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? వీరి ప్రేమకథ విజయవంతమైందా?
పెళ్లి పీటలపై వదిలేసి వెళ్లిపోయిన అజయ్ మళ్లీ నివి జీవితంలోకి ఎందుకు వచ్చాడు? స్టీవెన్‌కు దర్శకుడిగా అవకాశం దొరికిందా? చివరకు నివి ఎవరిని పెళ్లి చేసుకుంది? అనేదే మిగతా కథ.
వివరాలు
విశ్లేషణ
ప్రతి ప్రేమకథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదనే డైలాగ్ ఈ సినిమాకు ప్రధాన బలం. అదే ఆలోచనతో సాయిరాజేష్ ఈ ప్రేమకథను కొత్త కోణంలో ఆవిష్కరించారు.
'బేబీస సినిమాలో తొలి ప్రేమ గొప్పతనాన్ని హృద్యంగా చూపించిన సాయిరాజేష్.. ఈసారి "తొలి ప్రేమే అంతిమం కాదుష అనే భావనను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే సినిమా ప్రారంభం కొంత నెమ్మదిగా సాగుతుంది. కానీ స్టీవెన్ శంకర్ పాత్ర ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది.
అతని అమాయకత్వం, చలాకీతనం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హీరోయిన్ పాత్రను కూడా ఆసక్తికరంగా మలచడంతో ఫస్ట్ హాఫ్ ఎంతో హాయిగా సాగుతుంది.
వివరాలు
సెకండాఫ్ ఎలా ఉంది?
హీరో హీరోయిన్ జీవితంలో మార్పు తీసుకురావడానికి చేసే అల్లరి సన్నివేశాలు, తాను అనాథనని చెప్పే ఎమోషనల్ సీన్ ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి.
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే "గుర్తుందాష పాట ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ కథను ఒక్కసారిగా కొత్త మలుపు తిప్పుతుంది. దీంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.
ఫస్ట్ హాఫ్‌లోనే దర్శకుడు ఇచ్చిన హింట్స్ కారణంగా రెండో భాగంలో జరిగే పరిణామాలను ప్రేక్షకులు కొంతవరకు ముందే ఊహించగలుగుతారు.
ఇక్కడే కథ కొద్దిగా తడబడుతుంది. కొత్తదనం కోసం దర్శకుడు ప్రయత్నించినప్పటికీ.. కొన్ని సన్నివేశాలు పూర్తిగా కన్విన్సింగ్‌గా అనిపించవు.
సెకండాఫ్‌లో చెప్పాలనుకున్న విషయాన్ని ఫస్ట్ హాఫ్‌లోనే సూచించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది
వివరాలు
సఫలమైన దర్శకుడు
అయినా కొన్ని హృదయాన్ని తాకే సన్నివేశాలతో కథను నిలబెట్టడంలో దర్శకుడు సఫలమయ్యాడు.
కొన్ని సందర్భాల్లో ఇప్పటికే చూసిన ప్రేమకథలు గుర్తొచ్చినా.. వెంటనే బలమైన భావోద్వేగ సన్నివేశాలతో ఆ భావనను తగ్గించే ప్రయత్నం చేశాడు.
ముఖ్యంగా కుక్కల ఫైట్ సీన్, స్మశానంలో హీరోయిన్‌తో వచ్చే ఎమోషనల్ సన్నివేశం, క్లైమాక్స్ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయి.
అయితే సెకండాఫ్‌ను రచనా పరంగా ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే కథ మరింత ప్రభావవంతంగా ఉండేదనే భావన కలుగుతుంది.
వివరాలు
నటీనటుల నటన
ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం నటనే అతిపెద్ద ప్లస్ పాయింట్. స్టీవెన్ శంకర్ పాత్రలో ఆయన ఎంతో సహజంగా నటించారు. నటుడిగా మరింత పరిణతి సాధించినట్లు ఈ చిత్రం నిరూపిస్తుంది.
శ్రీ గౌరీ ప్రియ, నివి పాత్రలో అద్భుతంగా మెప్పించింది. ప్రేమ వైఫల్యంతో మానసికంగా కుంగిపోయిన యువతి పాత్రలో ఆమె చూపించిన భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయి.
ఈ పాత్రకు ఆమె సరైన ఎంపిక అనిపిస్తుంది. త్రిగుణ్ తన పాత్ర పరిధిలో చక్కగా నటించాడు.
స్నేహితుల పాత్రల్లో సిరి హనుమంతు, పూజ, నవీన్, కార్తీక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అతిథి పాత్రల్లో పి. వాసు, కరుణకుమార్ మెరిశారు.
వివరాలు
సాంకేతిక విభాగం
దర్శకుడు రవి నంబూరి ఇలాంటి సున్నితమైన ప్రేమకథను అనుభవజ్ఞుడిలా తెరపై ఆవిష్కరించారు.
మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉండగా.. నేపథ్య సంగీతం ప్రతి భావోద్వేగ సన్నివేశాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.
సాంకేతికంగా మణిశర్మకే అత్యధిక మార్కులు పడతాయి. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న చిన్న సినిమాల్లో ఇది ఒకటి.
నిడివి పెద్ద సమస్యగా అనిపించకపోయినా.. కొంత ట్రిమ్ చేసి ఉంటే కథనం మరింత వేగంగా సాగేదనే భావన కలుగుతుంది.
వివరాలు
ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది
కొత్త తరహా ప్రేమకథతో రూపొందిన 'చెన్నై లవ్‌స్టోరీస ప్రేమలోని నిజాయితీ, భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.
చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, సెన్సిబుల్ కథనం కలగలిపిన ఈ చిత్రం ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.
తెలుగు సినిమాల్లో వచ్చిన విభిన్న ప్రేమకథల్లో 'చెన్నై లవ్‌స్టోరీసకి ప్రత్యేక స్థానం దక్కే అవకాశముంది.