తలపతి విజయ్, లియో సినిమా బృందంపై కేసు నమోదు: నా రెడీ పాటే కారణం
ఈ వార్తాకథనం ఏంటి
తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో లియో పేరుతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి విజయ్ పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా నా రెడీ పాటను రిలీజ్ చేసారు.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అయితే తాజాగా విజయ్, సినిమా యూనిట్ పై పోలీస్ కేసు నమోదైంది.
చెన్నైలోని కూరుక్కుపేట్టయి కి చెందిన ఆర్టీఐ సెల్వం అనే వ్యక్తి ఈ కేసును నమోదు చేసారు.
అసలేం జరిగిందంటే?
లియో నుండి రిలీజైన నా రెడీ పాటలో డ్రగ్స్ వాడకాన్ని రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారని ఈ కేసును నమోదు చేసారు.
Details
తలపతి విజయ్, కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం
నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ కింద జూన్ 25వ తేదీన ఆన్ లైన్ లో కేసు నమోదు చేసి జూన్ 26 ఉదయం 10గంటలకు పిటీషన్ సబ్మిట్ చేసారు.
నా రెడీ పాటలో డ్రగ్స్ వాడకాన్ని అతిగా చూపించారని, రౌడీయిజాన్ని గొప్పగా చూపించారనీ ఈ కేసును నమోదు చేసారు.
తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ఇది. అంతకుముందు వీరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపిస్తుంది. సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ మీనన్, యాక్షన్ కింగ్ అర్జున్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.