విజయ్ లియో ఫస్ట్ లుక్: సుత్తి పట్టుకుని విలన్ల మీదకు పరుగెడుతున్న విజయ్
తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజైంది. విజయ్ పుట్టినరోజు(జూన్ 22) సందర్భంగా అర్థరాత్రి 12గంటలకు లియో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి అభిమానులకు బహుమతిగా అందించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్, బీస్ట్ మోడ్ లో కనిపించాడు. సుత్తి పట్టుకుని విలన్ల మీదకు ఎగబడుతున్నవాడిలా ఉన్నాడు. సుత్తికి రక్తపు ధారలు కారడం, వెనకాల తోడేలు కనిపించడం మొదలైనవన్నీ చూస్తుంటే పూర్తి మాస్ యాక్షన్ సినిమాగా అనిపిస్తోంది. లియో సినిమాలో హీరోయిన్ గా త్రిష కనిపిస్తోంది. సంజయ్ దత్, మిస్కిన్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.