Children's day: టాలీవుడ్ టాప్ చైల్డ్ ఓరియెంటెడ్ సినిమాలు ఇవే
పిల్లల నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి. కానీ అందులో కొన్ని మూవీస్ మాత్రమే చరిత్రను సృష్టించాయి. అందులో నటించిన చిన్నారులు ప్రేక్షకులను మెప్పించారు. అవార్డులను గెలుచుకున్నారు. మంగళవారం బాలల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ ఎప్పటికీ గుర్తుండిపోయే చైల్డ్ ఓరియెంటెడ్ మూవీస్‌ను ఓసారి పరిశీలిద్దాం. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన బాలల చిత్రం అంజలి. కామెడీ, ఎమోషన్‌ను కలగలిపి తీసిన ఈ సినిమాలో బేబి షామిలి, తరుణ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాలో నటించిన తరుణ్, షామిలికి జాతీయ అవార్డులు వచ్చాయి. టాలీవుడ్ చరిత్రలో బాలల చిత్రాల్లో టాప్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామాయణం. బాల రాముడిగా ఆయన నటన అద్భుతం అని చెప్పారు. ఈ సినిమా కూడా జాతీయ అవార్డును అందుకుంది.
'లిటిల్ సోల్జర్స్'కు ఇప్పటికీ ఫ్యాన్స్
దర్శకుడు గుణ్ణం గంగరాజు తీసిన 'లిటిల్ సోల్జర్స్' కు ఇప్పటికే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలో బాలాదిత్య, బేబీ కావ్య కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. అక్కినేని నట వారసుడు అఖిల్ ఏడాది వయస్సున్నప్పుడు చేసిన సినిమా సిసింద్రీ. అఖిల్ పాత్రనే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సోషియో ఫాంటసీ మూవీ. ఘటోత్కచుడు. ఓ పాప చుట్టూ తిరిగే కథ ఇది. అమెకు సాయం చేసే ఘటోత్కచుడు పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు. పిల్లలను కౌరవులు, పాండవులుగా చూపిస్తున్న తెరకెక్కిన సినిమా 'బాల భారతం'. ఈ సినిమాలో శ్రీదేవి శ్రీకృష్ణుడు పాత్ర చేశారు.