Swathi: రెండో పెళ్లిపై సైలెంట్‌గా సర్‌ప్రైజ్ ఇచ్చిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులకు "కలర్స్ స్వాతి" గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెలివిజన్ యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించిన ఆమె, అనంతరం హీరోయిన్‌గా కూడా పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. 2018లో కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినీ పరిశ్రమకు కొంతకాలం దూరంగా ఉంది. కొంత విరామం అనంతరం స్వాతి 'మంత్ ఆఫ్ మధు' చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమాల సమయంలో ఆమె వైవాహిక జీవితంపై పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
వివరాలు
ఆ హీరోయిన్ల జాబితాలో కలర్స్ స్వాతి..
ముఖ్యంగా భర్త వికాస్ వాసుతో ఆమె విడిపోయారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ వార్తలపై స్పందించేందుకు స్వాతి అప్పట్లో ఆసక్తి చూపలేదు. ఇప్పుడు అదే 'మంత్ ఆఫ్ మధు' చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ నాగోతితో స్వాతి వివాహం చేసుకోవడం విశేషంగా మారింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. "పెళ్లి చేసుకున్నాం" అంటూ శ్రీకాంత్ నాగోతిని ట్యాగ్ చేస్తూ వివాహానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. దీంతో, తనకు దర్శకత్వం వహించిన దర్శకుడినే జీవిత భాగస్వామిగా ఎంచుకున్న హీరోయిన్ల జాబితాలో కలర్స్ స్వాతి కూడా చేరింది.