NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Sankranthiki Vasthunam OTT: 'హను-మాన్‌' బాటలో 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి
    తదుపరి వార్తా కథనం
    Sankranthiki Vasthunam OTT: 'హను-మాన్‌' బాటలో 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి
    'హను-మాన్‌' బాటలో 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి

    Sankranthiki Vasthunam OTT: 'హను-మాన్‌' బాటలో 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 27, 2025
    04:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ 'సంక్రాంతికి వస్తున్నాం' జనవరి 14న విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

    ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది.

    13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.276 కోట్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో కూడా మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం 2.7 మిలియన్‌ డాలర్లను రాబట్టింది.

    ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద కొత్త సినిమాలు రాకపోవడంతో ఈ చిత్ర విజయానికి కలిసొచ్చే అంశంగా మారింది. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటిటి హక్కులను జీ5 సొంతం చేసుకుంది.

    Details

     ఫిబ్రవరి చివరి వారంలో ఓటిటిలో విడుదలకు సన్మాహాలు

    మొదట ఒప్పందం ప్రకారం, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2వ వారంలో స్ట్రీమింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.

    అయితే థియేటర్లలో ప్రేక్షకుల విశేష స్పందనను చూసి, స్ట్రీమింగ్‌ను మరింత ఆలస్యం చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

    మేకర్స్‌ జీ5 టీమ్‌ను స్ట్రీమింగ్‌ను వాయిదా వేయమని కోరినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర బృందం కోరిన మేరకు స్ట్రీమింగ్‌ను ఆలస్యం చేయడం వల్ల బాక్సాఫీస్‌ వసూళ్లను మరింత పెంచుకోనుంది.

    గత డిసెంబర్‌లో విడుదలైన 'పుష్ప 2' 56 రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతున్న సంగతి తెలిసిందే.

    ఆ లెక్కన చూస్తే 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో జీ5లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వెంకటేష్
    టాలీవుడ్

    తాజా

    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్
    Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం  డొనాల్డ్ ట్రంప్
    South Korea: దక్షిణ కొరియా నూతన సారథి లీ జే -మ్యుంగ్‌.. ఆయన ప్రస్థానం ఇదే..  దక్షిణ కొరియా

    వెంకటేష్

    సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో? తెలుగు సినిమా
    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్‌లో విక్టరీ సినిమా
    రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం ఓటిటి

    టాలీవుడ్

    Vijay Devarakonda: 'మోసపోకండి. నేను మూర్ఖుడిని కాదని' చెప్పిన విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Nidhi Agarwal: హీరోయిన్ నిధి అగర్వాల్‌కు వేధింపులు.. కేసు నమోదు సినిమా
    Daaku Maharaj: బాలకృష్ణ 'డాకు మహారాజ్' ట్విట్టర్ రివ్యూ బాలకృష్ణ
    Daggubati Family Case: హోటల్ కూల్చివేత.. వెంకటేశ్‌, సురేష్‌, రానాలపై కేసు వెంకటేష్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025