Loading...
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ రివ్యూ.. నక్సలిజం నేపథ్యంతో నవ్వులు పంచిన శ్రీవిష్ణు
కామ్రేడ్‌ కళ్యాణ్‌ రివ్యూ.. నక్సలిజం నేపథ్యంతో నవ్వులు పంచిన శ్రీవిష్ణు

Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ రివ్యూ.. నక్సలిజం నేపథ్యంతో నవ్వులు పంచిన శ్రీవిష్ణు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్'లో ఈవారం రిలీజ్ అయ్యిన సినిమా శ్రీవిష్ణు నటించిన 'కామ్రేడ్ కళ్యాణ్‌'. శ్రీవిష్ణు సినిమా అంటే న‌వ్వులు గ్యారెంటీ అన్న బ‌ల‌మైన ఓ న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో క‌నిపిస్తుంటుంది. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌చార చిత్రాలు ఊరించాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది ఇప్పుడు చూద్దాం?

వివరాలు 

కథేంటంటే..

1990లలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సాగే కథ ఇది. పెద్దగా చదువుకోని కళ్యాణ్‌ (శ్రీవిష్ణు) ఓ థియేటర్‌ను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు.

అదే సమయంలో నక్సలైట్‌ దళాలను ఏరివేయడానికి ఐపీఎస్‌ అధికారి జార్జ్‌కుట్టి (షైన్‌ టామ్‌ చాకో) రంగంలోకి దిగుతాడు.

మాస్టర్‌ (సాయిచంద్‌) దళానికి, పోలీసులకు మధ్య పోరు కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో సితారదేవి (మహిమా నంబియార్‌) తన కుటుంబంతో ఆ ప్రాంతానికి వస్తుంది.

ఆమె తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్‌కుమార్‌)ను కళ్యాణ్‌ కాపాడటంతో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సితార కుటుంబాన్ని ఆదుకోవడానికి కళ్యాణ్‌ ప్రయత్నిస్తాడు.

స్నేహితుడు దుబాయ్‌ బాబు (సత్య) సాయంతో అతడు ఎంచుకున్న మార్గం అతడి జీవితాన్ని మార్చేస్తుంది.

వివరాలు 

కామ్రేడ్‌ కళ్యాణ్‌ ఎలా ఉందంటే..

సాధారణ థియేటర్‌ నిర్వాహకుడైన కళ్యాణ్‌.. పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారతాడు. అసలు అతడికి నక్సలైట్‌ దళాలతో ఉన్న సంబంధం ఏమిటన్నది మిగతా కథ.

నక్సలిజం నేపథ్యాన్ని ఎంచుకున్నప్పటికీ, దర్శకుడు జానకిరామ్‌ మారెళ్ల ఈ సినిమాను ప్రధానంగా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు.

సీరియస్‌ అంశాలను పక్కనపెట్టి, నవ్వులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.

తొలి భాగంలో రాధికా శరత్‌కుమార్‌ చేసే సందడి, సత్య రాసే ప్రేమలేఖ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.

ఉపేంద్ర లిమాయే పాత్ర ప్రవేశంతో వినోదం మరింత పెరుగుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

కామ్రేడ్‌ కళ్యాణ్‌ ఎలా ఉందంటే..

విరామానికి ముందు వచ్చే అనూహ్య మలుపు కథపై ఆసక్తిని పెంచుతుంది.

ద్వితీయార్ధంలో అడవి, నక్సలైట్‌ దళాలు, పోలీసుల మధ్య పోరును కూడా హాస్యంతో మేళవించారు.

వెన్నెల కిశోర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ సన్నివేశాలు నవ్విస్తాయి. 90ల నేపథ్యం ఉన్నప్పటికీ, సమకాలీన అంశాలు, సినీ తారల ప్రస్తావనలతో హాస్యం పండించారు.

అయితే కథలో లాజిక్‌ లోపించడం, వాస్తవికతకు దూరంగా సన్నివేశాలు సాగడం ప్రతికూలతలు. చివరి సన్నివేశాలు కూడా పెద్దగా ప్రభావం చూపించవు.

ADVERTISEMENT

వివరాలు 

నటీనటులు, సాంకేతిక విభాగం

శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. సత్య, సుదర్శన్‌ ఆయనకు చక్కని సహకారం అందించారు.

రాధికా శరత్‌కుమార్‌, బ్రహ్మాజీ, రఘుబాబు, ఉపేంద్ర లిమాయే, వెన్నెల కిశోర్‌, మురళీధర్‌ గౌడ్‌, ప్రభాస్‌ శ్రీను, సాయిచంద్‌ తదితరులు తమ పాత్రలతో సందడి చేశారు.

మహిమా నంబియార్‌కు నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా, పాటల్లో అందంగా కనిపించారు.

షైన్‌ టామ్‌ చాకో పాత్ర మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేదు. సాయిశ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ, విజయ్‌ బుల్గానిన్‌ పాటలు బాగున్నాయి.

నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. నందు, భాను, కోన వెంకట్‌ రచన, సంభాషణలు సినిమాకు ప్రధాన బలం.

దర్శకుడు జానకిరామ్‌ మారెళ్ల మేకింగ్‌పై పట్టు చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

వివరాలు 

నటీనటులు, సాంకేతిక విభాగం

బలాలు: హాస్యం, కథలో మలుపులు, శ్రీవిష్ణు సహా నటీనటుల ప్రదర్శన.

బలహీనతలు: వాస్తవికతకు దూరంగా సాగే కథ, క్లైమాక్స్‌.

చివరిగా: లాజిక్‌ గురించి ఎక్కువగా ఆలోచించకుండా చూస్తే 'కామ్రేడ్‌ కళ్యాణ్‌' నవ్వులు పంచే వినోదాత్మక చిత్రం.

ADVERTISEMENT