Ranbir Kapoor: దసరా వ్యాఖ్యలపై వివాదం.. చివరకు క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్ కపూర్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ దసరా వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. చెడుపై మంచి విజయం సాధిస్తుందనే సందేశాన్ని తెలియజేసే క్రమంలో ఆయన పొరపాటున నోరు జారడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన రణ్‌బీర్ కపూర్ క్షమాపణలు తెలిపారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, అనుకోకుండా జరిగిన పొరపాటుగా భావించాలని కోరారు. 'రామాయణ' సినిమా ప్రచారంలో భాగంగా అక్టోబర్ 20న కోల్‌కతాలో నిర్వహించిన దసరా వేడుకల్లో రణ్‌బీర్ కపూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దసరా పండుగ విశిష్టతను వివరిస్తూ, చెడుపై మంచి సాధించే విజయాన్ని ప్రస్తావించారు.
వివరాలు
అది కేవలం ఒక పొరపాటు మాత్రమే
అయితే తన ప్రసంగంలో పొరపాటున మంచి, నిజాయతీ అంతమవుతాయనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
ఈ వివాదంపై తాజాగా స్పందించిన రణ్‌బీర్.. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాను చెప్పాలనుకున్న భావం వేరని వివరణ ఇచ్చారు. 'నేను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు.
అది కేవలం ఒక పొరపాటు మాత్రమే. నేను చెప్పాలనుకున్నది వేరు. చెడు ఎంత శక్తిమంతమైనదైనా చివరకు మంచే విజయం సాధిస్తుంది అని చెప్పాలనుకున్నానని రణ్‌బీర్ కపూర్ తెలిపారు.
తన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఈ వివాదంపై వివరణ ఇచ్చారు.