Page Loader
'కీడా కోలా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ 
తరుణ్ భాస్కర్ 'కీడా కోలా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ

'కీడా కోలా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ 

వ్రాసిన వారు Stalin
Oct 28, 2023
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించి, నటించిన క్రైమ్ కామెడీ డ్రామా 'కీడా కోలా'. ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. దీంతో అక్టోబర్ 29న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ వస్తున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లి చూపులు సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌ను ఎలా మలుపుతిప్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్