D55 : క్రేజీ మల్టీస్టారర్‌కు శ్రీకారం.. ధనుష్ సినిమాకు సాయి పల్లవి, శ్రీలీల గ్లామర్
ఈ వార్తాకథనం ఏంటి
వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో ధనుష్, తన 55వ సినిమాకు 'అమరన్' ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామితో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని ధనుష్‌కు చెందిన 'వండర్‌బార్ ఫిల్మ్స్', 'ఆర్ టేక్ స్టూడియోస్' సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. నేడు (శనివారం) జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర యూనిట్‌తో పాటు దర్శకుడు శంకర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది హీరోయిన్ల ఎంపిక. టాలీవుడ్ సెన్సేషన్స్ సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరూ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Details
సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
'అమరన్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తున్న వరుసగా రెండో సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు 'పరాశక్తి' చిత్రంతో తమిళ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీలీలకు, రెండో సినిమానే స్టార్ హీరో ధనుష్ సరసన అవకాశం రావడం మరింత ఆసక్తికరంగా మారింది. మాస్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సాయి పల్లవి, మరోవైపు యూత్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న శ్రీలీల, ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించనుండటంతో సినిమాపై గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ ఏర్పడింది. ఈ ముగ్గురు స్టార్లు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.