Nani: నాని బర్త్‌డేకు క్రేజీ అప్డేట్?.. న్యూ మూవీ టైటిల్ రివీల్ టాక్!
ఈ వార్తాకథనం ఏంటి
నాచురల్ స్టార్ నాని 'అష్టాచమ్మ' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా పలు బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ 'పక్కింటి అబ్బాయి' ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా ఉన్న నాని, వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ షెడ్యూల్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో నాని ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Details
2027లో రిలీజ్ చేసేందుకు ప్లాన్
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఆసక్తిని పెంచేలా ఉండటంతో, అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 'ది ప్యారడైజ్' తర్వాత నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్‌తో మరో సాలిడ్ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్‌తోనే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అప్పటిలోపు షూటింగ్‌ను కూడా పూర్తిచేసేలా సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించనుంది.
Details
సోషల్ మీడియాలో వైరల్
ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాని పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 24ను ప్రత్యేకంగా మార్చుతూ, నాని-సుజిత్ కాంబినేషన్ మూవీ టైటిల్‌ను అదే రోజు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను ఒక స్పెషల్ వీడియో ద్వారా రివీల్ చేయనున్నారని కూడా టాక్. ఇందులో నిజమెంతుందో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారుతోంది.