Allari Naresh: అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ దర్శకుడు దివంగత ఈ.వి.వి. సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లకు తాతగారైన ఈదర వెంకట్ రావు మంగళవారం(జనవరి 20) తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వెంకట్ రావు భార్య వెంకటరత్నం 2019 మే 27న మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు దివంగత ఈ.వి.వి. సత్యనారాయణ ప్రముఖ దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. రెండో కుమారుడు ఇ.వి.వి. గిరి, మూడో కుమారుడు ఇ.వి.వి. శ్రీనివాస్ కాగా, కుమార్తె ముళ్ళపూడి మంగాయమ్మ.
Details
పలువురు ప్రముఖులు సంతాపం
ప్రముఖ నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లకు ఈదర వెంకట్ రావు స్వయానా తాతగారు. తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకట్ రావు పార్థివ దేహానికి నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఈదర కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.