LOADING...
Dekh lenge Saala Song Promo: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి 'దేఖ్ లేంగే సాలా' ప్రోమో వచ్చేసింది..

Dekh lenge Saala Song Promo: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి 'దేఖ్ లేంగే సాలా' ప్రోమో వచ్చేసింది..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
07:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. డైనమిక్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం అందించేది మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం కాబట్టి, ఉస్తాద్ భగత్ సింగ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా, ఓజీ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉండటం వల్ల ఆ అంచనాలు మరింత పెరిగాయి.

వివరాలు 

చాలా క్రేజీగా పవన్ కళ్యాణ్ డాన్స్ 

సినిమా మేకర్స్ ప్రకటించిన ప్రకారం, ఈ సినిమా 2026 ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా 'దేఖ్ లేంగే సాలా' అనే స్టైలిష్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. రాక్ స్టార్ దేవి అందించిన ఆ పాట ఒక రేంజ్ లో ఉంది. పాటలో పవన్ కళ్యాణ్ డాన్స్ చాలా క్రేజీగా ఉంది. చాలా కాలం తర్వాత ఈ రేంజ్‌లో డాన్స్ చేస్తున్న పవన్‌ను చూసి ఆయన ఫ్యాన్స్ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోమోనే ఈ లెవెల్‌లో ఉంటే ఇంక, ఫుల్ సాంగ్ డిసెంబర్ 13న విడుదల కానున్నడంతో, అది మరింత ఆకట్టుకునేలా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

Advertisement