LOADING...
Dhurandhar: జియో హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్‌' సందడి
జియో హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్‌' సందడి

Dhurandhar: జియో హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్‌' సందడి

వ్రాసిన వారు Moogati Shabari
May 21, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్య ధర్‌ రూపొందించిన భారీ విజయ చిత్రం 'ధురంధర్‌' మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ చిత్ర రెండో భాగం విదేశాల్లో ఓటీటీలో ప్రసారమవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలో చిత్రబృందం అభిమానులకు ప్రత్యేక కానుకగా 'ధురంధర్‌' తొలి భాగం అన్‌కట్‌ వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక వెర్షన్‌ మే 22 నుంచి ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. సుమారు 3 గంటల 25 నిమిషాల నిడివితో రూపొందించిన ఈ అన్‌కట్‌ వెర్షన్‌లో థియేటర్లలో కనిపించని పలు సన్నివేశాలను కూడా చేర్చినట్లు సమాచారం.

వివరాలు

రెండు ఓటీటీల్లో అన్ కట్ వెర్షన్స్..

అదే సమయంలో, 'ధురంధర్‌' రెండో భాగం భారతదేశంలో జూన్‌ 4 రాత్రి 7 గంటల నుంచి జియో స్టార్ లో ప్రసారం కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. ఇక విదేశీ ప్రేక్షకులు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ద్వారా వీక్షించవచ్చు. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని నమోదు చేసింది. థియేటర్లలో విడుదలైన వెర్షన్‌ నిడివి 3 గంటల 49 నిమిషాలు ఉండగా, ఓటీటీ కోసం అదనపు సన్నివేశాలతో దీన్ని 3 గంటల 52 నిమిషాలుగా విస్తరించారు.

Advertisement