Loading...
Toxic: 'ధురంధర్‌' రికార్డు బద్దలు.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో యశ్‌ 'టాక్సిక్' జోరు!
'ధురంధర్‌' రికార్డు బద్దలు.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో యశ్‌ 'టాక్సిక్' జోరు!

Toxic: 'ధురంధర్‌' రికార్డు బద్దలు.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో యశ్‌ 'టాక్సిక్' జోరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

యశ్‌ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' (Toxic)పై విడుదలకు ముందే భారీ క్రేజ్‌ కనిపిస్తోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 21న ప్రారంభమైన టికెట్‌ బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుండటంతో.. రిలీజ్‌కు ముందే 'టాక్సిక్' బాక్సాఫీస్‌ వద్ద సందడి మొదలుపెట్టింది. తాజా ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. తొలి రోజు కోసం భారత్‌లో డైరెక్ట్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.21.5 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది.

వివరాలు

5.55 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం

13,591 షోలకు సంబంధించి దాదాపు 5.55 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

హోల్డ్‌లో ఉంచిన సీట్లను కూడా కలుపుకుంటే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విలువ ఏకంగా రూ.30.14 కోట్లను దాటినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

యశ్‌ సొంత రాష్ట్రం కర్ణాటకలో 'టాక్సిక్' బుకింగ్స్‌ దూసుకుపోతున్నాయి. అక్కడ ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు నమోదైనట్లు సమాచారం.

దీంతో విడుదలకు ముందే కర్ణాటకలో ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ 'టాక్సిక్' మేనియా కొనసాగుతోంది.

హిందీ బెల్ట్‌లో ఇప్పటికే రూ.7.35 కోట్లకు పైగా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరిగినట్లు తెలుస్తోంది.

వివరాలు

మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం

ఇక నార్త్‌ అమెరికాలో ప్రీమియర్‌ షోలకు సంబంధించిన బుకింగ్స్‌ ద్వారా 1.63 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.1.56 కోట్లు వసూలయ్యాయి.

విదేశాల్లో 'టాక్సిక్'ను 260 లొకేషన్లలోని 709 ప్రాంతాల్లో విడుదల చేయనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమెరికాలో కన్నడ వెర్షన్‌ కంటే తెలుగు వెర్షన్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన 'ధురంధర్‌' అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రికార్డులను 'టాక్సిక్' అధిగమించినట్లు తెలుస్తోంది.

విడుదలకు ఇంకా సమయం ఉండటంతో.. ఆగస్టు 26 నాటికి ఈ సినిమా మరిన్ని మైలురాళ్లను దాటే అవకాశం ఉందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT