Jai Hanuman-Cinema: జై హనుమాన్ పోస్టర్...అభిమానులకు గూస్ బంప్సే
శ్రీరామ నవమి(Sri Rama Navami)సందర్భంగా హను-మాన్(Hanuman)దర్శకుడు ప్రశాంత్ వర్మ(Director Prasanth Varma)మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పట్నుంచో ఊరిస్తున్నప్రశాంత్ వర్మ ఆ స్టేట్ మెంట్ ను కన్ఫర్మ్ చేస్తూ జై హనుమాన్ (Jai Hanuman) పేరుతో పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆయన చేసిన జై హనుమాన్ పోస్టర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రాముడి చేతిలో హనుమంతుడు చేయివేసినట్లు గా ఉన్న ఆ ఫస్ట్ పోస్టర్ అభిమానులకు మంచి ఫీల్ నిచ్చింది. జై హనుమాన్ పేరుతో ఉండే ఈ ఫ్రాంచైజీ పూర్తయ్యి విడుదలైతే మరో 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం ఖాయం అన్న ప్రామిసింగ్ కూడా ఈ పోస్టర్ లో అన్వయించుకోవచ్చు.
ఈ సారి కూడా 300 కోట్ల కలెక్షన్స్...
రాముడు హనుమంతుడికి ఇచ్చిన మాటేమిటి అన్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. 2025 నాటికి విడుదల చేయాలని ఈ మూవీ మేకర్స్ భావిస్తున్నారు. తేజ సజ్జ (Teja sajja)) హీరోగా హనుమాన్ పేరుతో గతేడాది థియేటర్ లలో రిలీజై దేశవ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబట్టింది. సుమారు 300 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు సమాచారం.