Prabhas: 'సలార్ 2' త్వరలోనే ప్రారంభం కానుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ ప్రస్తుతం మూడు ప్రధాన చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో 'ఫౌజీ' సినిమా చివరి దశకు చేరుకోగా, 'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్‌ల షూటింగ్‌లు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో 'సలార్ 2' చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ తాను త్వరలో ఒక మైథలాజికల్ ప్రాజెక్ట్‌పై పని చేయనున్నట్లు వెల్లడించడంతో, 'సలార్' సీక్వెల్ ఉండకపోవచ్చనే ప్రచారం మరింత పెరిగింది.
వివరాలు
2027 చివరి నాటికి 'సలార్ 2: శౌర్యాంగపర్వం'
అయితే వైరల్ అవుతున్న వార్తలపై ప్రశాంత్ నీల్ తాజాగా స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న 'డ్రాగన్' సినిమా పూర్తైన వెంటనే 'సలార్ 2' పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. 'డ్రాగన్' చిత్రం వచ్చే ఏడాది ప్రారంభానికి పూర్తయ్యే అవకాశముందని సమాచారం. అదే సమయానికి ప్రభాస్ కూడా 'ఫౌజీ', 'స్పిరిట్' చిత్రాలను పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 'సలార్ 2: శౌర్యాంగపర్వం' సినిమా 2027 చివరినాటికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.