Page Loader
Salaar : రేట్లు ఎక్కువ చెప్పడంతో వెనక్కి తగ్గిన డిస్ట్రిబ్యూటర్లు.. షాక్‌లో ప్రభాస్ ఫ్యాన్స్! 
రెట్లు ఎక్కువ చెప్పడంతో వెనక్కి తగ్గిన డిస్ట్రిబ్యూటర్లు.. షాక్‌లో ప్రభాస్ ఫ్యాన్స్!

Salaar : రేట్లు ఎక్కువ చెప్పడంతో వెనక్కి తగ్గిన డిస్ట్రిబ్యూటర్లు.. షాక్‌లో ప్రభాస్ ఫ్యాన్స్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2023
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ చిత్రం 'సలార్'. ఈ మూవీ హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదాపడ్డ ఈ మూవీ డిసెంబర్ 22న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సలార్ విడుదలకు మరికొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్‌ను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి మూవీ టీం సన్మాహాలను చేస్తోంది. ఇక సలార్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో సాగుతోంది.

Details

ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ లిస్ట్ వచ్చేసింది

కన్నడల్లో హోంబలే ఫిల్మ్ రిలీజ్ చేస్తుండగా, తమిళనాడులో ఉదయ నిధి స్టాలిన్‌కి సంబంధించిన రెడ్ జయంట్ మూవీస్ భారీ స్థాయిలో 'సలార్' ను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. తాజాగా ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఉత్తరాంధ్రలో సిరి సాయి సినిమా, తూర్పు గోదావరి లక్ష్మి నరసింహ శ్రీ మణికంఠ ఫిల్మ్స్, కృష్ణ, గుంటూరు కె.ఎన్.ఎన్ టెలీ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి ప్రకటన వెలువడాల్సి ఉంది. సలార్ పెద్ద ప్రాజెక్టు కావడంతో ఆ స్థాయి డిస్ట్రిబ్యూటర్స్‌నే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ రేట్లు ఎక్కువ చెప్పడంతో పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి తగ్గడం ప్రభాస్ ఫ్యాన్స్‌కు వర్రీగా మారింది.