LOADING...
Kantara Chapter 1: కాంతారా ఛాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి, రుక్మిణీ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా? 
కాంతారా ఛాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి, రుక్మిణీ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

Kantara Chapter 1: కాంతారా ఛాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి, రుక్మిణీ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతార చాప్టర్-1 సినిమా అక్టోబర్ 2 (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించిన కాంతారా సినిమా కోసం ఇది ప్రీక్వెల్‌గా రూపొందించబడింది. మొదటి భాగాన్ని దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి ఈ కొత్త పార్ట్‌కి కూడా దర్శకునిగా వ్యవహరిస్తూ, ప్రధాన పాత్రలో నటించాడు. అంతే కాదు, స్క్రీన్‌ప్లే రాయడం,డైలాగ్‌ల బాధ్యతను కూడా ఆయన స్వయంగా తీసుకున్నారు.

వివరాలు 

మొదటి భాగానికి 400కోట్లకు పైగా కలెక్షన్లు

మరి ఇన్ని బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించిన రిషబ్ శెట్టి కాంతారా ఛాప్టర్ 1 కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు?అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్నది తెలుసుకునేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖ హీరోలు తమ సినిమాల కోసం పారితోషికం తీసుకోకుండా,లాభాల్లో వాటా తీసుకునే విధానం ప్రాచుర్యం పొందింది. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖులు ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనూ కనిపిస్తోంది. కాంతారా:ఛాప్టర్ 1 విషయంలో రిషబ్ శెట్టి ఈ విధానాన్ని ఫాలో చేస్తున్నట్లు సమాచారం. ముందరి భాగం కేవలం రూ.15-20కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడినా, అది మార్కెట్‌లో సుమారు రూ. 400కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

వివరాలు 

 కొత్త భాగం కోసం 125 కోట్ల వరకు ఖర్చు 

అయితే, కొత్త భాగం కోసం నిర్మాతలు భారీ బడ్జెట్‌ని కేటాయించారు. అందులో సుమారు రూ. 125 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. రిషబ్ శెట్టికి ఈ సినిమా కోసం ఎలాంటి స్థిర పారితోషికం ఇవ్వలేదని చెబుతున్నారు. కానీ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో అతనికి హోంబాలే ఫిల్మ్స్ నుండి వాటా పొందడం ఖాయం. కాంతారా: ఛాప్టర్ 1లో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తారలందరికీ సుమారు తలో రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అలాగే, అజనీష్ లోక్ నాథ్‌కు కూడా భారీ పారితోషికం అందినట్లు సమాచారం.