AR Rahman Controversy: సంగీతానికి మతం ఉందా?.. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దూమారం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి. ఎనిమిదేళ్లుగా తనకు అవకాశాలు తగ్గాయని, దీనికి కారణం కేవలం పని విధానంలో మార్పులే కాకుండా నిర్ణయాలు తీసుకునే వారి ఆలోచనలు కూడా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈమాటల్లో "కమ్యూనల్" కోణం ఉండొచ్చని ఆయన ప్రస్తావించడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది.ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో తమిళ వర్గం పట్ల వివక్ష ఉందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. 1990లలో మీ అనుభవం ఎలా ఉంది?" అనే ప్రశ్న అడిగారు. దీనికి స్పందిస్తూ, అప్పట్లో తనకు అలాంటి విషయాలేవీ తెలియలేదని, బహుశా దేవుడే వాటిని తననుంచి దాచేశాడేమోనన్నారు. అనంతరం ఆయన ఒక కీలక విషయాన్ని ప్రస్తావించారు.
Details
సృజనాత్మకత లేని వాళ్ల చేతుల్లో అధికారం ఉంది
గత ఎనిమిదేళ్లుగా పరిస్థితులు మారిపోయాయని, ప్రస్తుతం సృజనాత్మకత లేని వాళ్ల చేతుల్లో అధికారముందని వ్యాఖ్యానించారు. అయితే ఇది తాను నేరుగా ఎదుర్కొన్న అనుభవం కాదని, ఇతరుల ద్వారా తన చెవిన పడిన మాటలని స్పష్టం చేశారు. కొన్ని సినిమాల్లో తనను ఎంపిక చేశామని చెప్పి, చివరికి మ్యూజిక్ కంపెనీలు మరికొందరు కంపోజర్లను నియమించిన సందర్భాలు ఉన్నాయని రెహమాన్ తెలిపారు. అలా జరిగినా తనకు బాధ అనిపించలేదని చెప్పారు. "నాకు విశ్రాంతి దొరికింది,కుటుంబంతో సమయం గడపవచ్చని భావించి సింపుల్‌గా తీసుకున్నానన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు కమ్యూనల్ కోణంలో అర్థం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఇదే ఇంటర్వ్యూలో 'ఛావా' సినిమా గురించి కూడా రెహమాన్ మాట్లాడారు. ఆసినిమా సంగీతంపై తాను గర్వపడుతున్నానని చెప్పారు.
Details
అనేక జాతీయ అవార్డులను గెలుచుకున్న రెహమాన్
అయితే ఆ చిత్రంలో కొంత విభజన భావాన్ని ఉపయోగించారని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, ధైర్యం, వీరత్వాన్ని చూపించడమే ఆ సినిమా అసలు ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. రెహమాన్ కెరీర్‌ను పరిశీలిస్తే ఆయన ప్రతిభపై ఎవరికీ సందేహం అవసరం లేదనే చెప్పాలి. ఆయన అనేక జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. 'కాట్రు వెలియిడై', 'మామ్', 'పొన్నియిన్ సెల్వన్-1' వంటి సినిమాలకు అవార్డులు కూడా అందుకున్నారు. అలాంటి వ్యక్తి నోట నుంచి కమ్యూనల్ వివక్ష అన్న మాటలు రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వివాదంపై రచయిత జావేద్ అఖ్తర్ స్పందిస్తూ, ఈ అంశాన్ని అతిగా పెద్దది చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
Details
కమ్యూనల్ కోణం లేదని అనిపిస్తోంది
ముంబైలో రెహమాన్‌కు ఎంతో గౌరవం ఉందని, ఆయన పశ్చిమ దేశాల ప్రాజెక్టులు, పెద్ద షోలతో బిజీగా ఉంటారని భావించి చిన్న నిర్మాతలు ఆయనను సంప్రదించడానికి భయపడుతుంటారేమోనని అభిప్రాయపడ్డారు. ఇందులో కమ్యూనల్ కోణం లేదని తనకు అనిపిస్తోందని స్పష్టం చేశారు. గాయకుడు షాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఎన్నో పాటలు పాడినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఆఫర్లు రాని పరిస్థితులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోనని, ప్రతి ఒక్కరికీ వారి వారి అభిరుచులు ఉంటాయని అన్నారు. రెహమాన్‌కు ప్రత్యేకమైన స్టైల్ ఉందని, ఆయన అభిమానులు తగ్గలేదు, మరింత పెరుగుతున్నారని చెప్పారు.
Details
పెద్ద చర్చకు దారితీసిన వ్యాఖ్యలు
సంగీతంలో కమ్యూనల్ లేదా మైనారిటీ అనే కోణం ఉండదని, సంగీతం అలా పనిచేయదని షాన్ స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే, ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు ఒక పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు వాటిని తప్పుగా అర్థం చేసుకోగా, మరికొందరు ఆయన నిజాయితీగా తన అనుభవాన్ని వెల్లడించారని భావిస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం—కాలం మారుతోంది, పరిశ్రమ మారుతోంది. కొత్త తరం ముందుకు వస్తోంది. ఆఫర్లు ఎప్పటికీ ఒకేలా ఉండవన్నది జగమెరిగిన సత్యం.