Double iSmart: రామ్ పోతినేని పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మేకర్స్
ఇంకొద్ది సేపట్లో రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్‌లో ఇస్మార్ట్ శంకర్ కాంబోలో ఆశించే మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని అంటున్నారు. ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ లాంచ్ ప్లాన్ చేశారు. టీజర్‌కు ముందు, మేకర్స్ హీరో పుట్టినరోజుపురస్కరించుకుని రామ్ పోతినేని స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో, రామ్ సిగార్ తాగుతూ కూల్ స్వాగ్ మెయింటెయిన్ చేస్తూ కనిపించాడు. మరి టీజర్‌తో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ వెల్లడిస్తారేమో చూడాలి.
జులైలో విడుదలకు సిద్దమైన డబుల్ ఇస్మార్ట్
ఈ మాస్ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. రామ్ పోతినేని,పూరి జగన్నాధ్ అభిమానులు డబుల్ ఇస్మార్ట్ నుండి బ్లాక్ బస్టర్ ఆశిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మీ కౌర్, పూరి జగన్నాధ్ ఈ పాన్ ఇండియన్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విల్లన్ గా ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ .