LOADING...
Devi Sri Prasad: 'ఉస్తాద్ భగత్ సింగ్'తో హీట్ పెంచిన డీఎస్పీ.. పవన్ పాటకు స్టెప్పులు!
'ఉస్తాద్ భగత్ సింగ్'తో హీట్ పెంచిన డీఎస్పీ.. పవన్ పాటకు స్టెప్పులు!

Devi Sri Prasad: 'ఉస్తాద్ భగత్ సింగ్'తో హీట్ పెంచిన డీఎస్పీ.. పవన్ పాటకు స్టెప్పులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. 'గబ్బర్ సింగ్'లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలుస్తుండటంతో సినిమా మొదలైనప్పటి నుంచే భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' సాంగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ తన ట్రేడ్‌మార్క్ మేనరిజమ్స్‌తో పాటు ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మాస్ బీట్‌లు, పవన్ స్టైలిష్ లుక్స్ కలిసి ఈ పాటను చార్ట్‌బస్టర్‌గా నిలిపాయి.

Details

ఏప్రిల్ లో రిలీజ్

సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, ఏప్రిల్ 2026లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ పాటకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా 'దేఖ్ లేంగే సాలా' పాటకు స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విదేశీ వీధుల్లో తనదైన స్టైల్లో డీఎస్పీ వేసిన స్టైలిష్ స్టెప్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Details

వీడియో షేర్ చేసిన మేకర్స్

డీఎస్పీ ఎనర్జీకి ఈ వీడియో ప్రత్యక్ష ఉదాహరణ అని, కేవలం మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా పాటను ఎలా ఆస్వాదించాలో కూడా ఆయన చూపిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో 'గబ్బర్ సింగ్'కు అదిరిపోయే సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్, ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మరోసారి తన మ్యూజిక్ మ్యాజిక్‌ను రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement