Page Loader
Eagle teaser: 'ప్రభుత్వాలు కప్పెట్టిన కథ'.. రవితేజ ఈగల్ టీజర్ రిలీజ్ 
Eagle teaser: 'ప్రభుత్వాలు కప్పెట్టిన కథ'.. రవితేజ ఈగల్ టీజర్ రిలీజ్

Eagle teaser: 'ప్రభుత్వాలు కప్పెట్టిన కథ'.. రవితేజ ఈగల్ టీజర్ రిలీజ్ 

వ్రాసిన వారు Stalin
Nov 06, 2023
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల టైగర్ నాగేశ్వర రావు చిత్రంతో అలరించిన మాస్ మహరాజ్ రవితేజ.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ మేకర్స్ సోమవారం 'ఈగల్‌' టీజర్‌ను విడుదల చేసారు. టీజర్‌ను బట్టి చూస్తే సినిమా యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌ అని తెలుస్తోంది. కొండ‌లో లావాను కింద‌కు పిల‌వ‌కు.. ఊరు ఉండ‌దు అంటూ రవితేజ చెప్పిన డైలాగులు, ప్రభుత్వాలు కప్పెట్టిన కథ అంటూ చెప్పిన మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. జనవరి 13న సంక్రాతి కానుకగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల పోషిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్