Loading...
Nani: యూట్యూబ్ ట్రెండింగ్‌లో 'ఏష నాగుల..' పాట.. భారీ వ్యూస్, లైక్స్‌తో దూకుడు!
యూట్యూబ్ ట్రెండింగ్‌లో 'ఏష నాగుల..' పాట.. భారీ వ్యూస్, లైక్స్‌తో దూకుడు!

Nani: యూట్యూబ్ ట్రెండింగ్‌లో 'ఏష నాగుల..' పాట.. భారీ వ్యూస్, లైక్స్‌తో దూకుడు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో సినిమా థీమ్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో జడల్ పాత్రలో నాని ఊర మాస్ అవతార్‌లో కనిపించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా సినిమాలోని 'ఏషనాగుల' పాటను విడుదల చేసింది. తెలంగాణ జానపద బాణీ ఆధారంగా రూపొందిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.

వివరాలు

స్వరాలను సమకూర్చిన అనిరుథ్

'ఏషనాగుల' పాట యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. పాట విడుదలై 24 గంటలు కూడా పూర్తికాకముందే ఏకంగా 31 మిలియన్ వ్యూస్, 4 లక్షలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది.

మాస్ బీట్‌తో రూపొందిన ఈ పాటకు మాస్ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారు ఫిదా అవుతున్నారు. దీంతో పలువురు ఈ పాటను రిపీటెడ్‌గా చూస్తున్నారు.

ఆట సందీప్ కొరియోగ్రఫీలో నాని-కీర్తి సురేశ్ జోడీ వేసిన స్టెప్పులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వారి డ్యాన్స్ ప్రేక్షకులను అలరిస్తోంది. 'ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల..' అంటూ సాగే తెలంగాణ జానపద బాణీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కొత్తగా స్వరాలు అందించారు.

వివరాలు

కీలక పాత్రలో మోహన్ బాబు

ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక 'దసరా' వంటి హిట్ సినిమా తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో 'ది ప్యారడైజ్'పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ మ్యూజిక్ సంచలనం అనిరుధ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో సీనియర్ హీరో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

సెప్టెంబర్ 24న 'ది ప్యారడైజ్' సినిమా విడుదల కానుంది.

ADVERTISEMENT