LOADING...
War 2 : వార్ 2 నుంచి అభిమానులకు ‏కు కిక్కిచ్చే న్యూస్.. 
వార్ 2 నుంచి అభిమానులకు ‏కు కిక్కిచ్చే న్యూస్..

War 2 : వార్ 2 నుంచి అభిమానులకు ‏కు కిక్కిచ్చే న్యూస్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 'దేవ‌ర' సినిమాతో సాలిడ్ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయ‌న బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ 'వార్ 2' చిత్రంలో నటిస్తున్నాడు. 'వార్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తారక్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాలు 

రంగంలోకి 500 మంది డ్యాన్సర్లు 

ఈ చిత్రంలో హృతిక్,ఎన్టీఆర్‌ల మధ్య ఓ స్పెషల్ డ్యాన్స్ సీక్వెన్స్ ఉండనుందట.ఈ పాట కోసం ప్రత్యేకంగా 500 మంది డ్యాన్సర్లను రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్, ఎన్టీఆర్ కలిసి ఈ డ్యాన్స్ సీక్వెన్స్‌లో మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త స్టెప్పులతో ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ప్రస్తుతం యష్‌రాజ్ స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ప్రీతమ్ సంగీతం అందిస్తున్న ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ డిజైన్ చేస్తున్నాడు. ఈ కోసం ప్రొడక్షన్ డిజైనర్ అమృత మహల్ ఓ గ్రాండ్ సెట్‌ను రూపొందించారని, ప్రీతమ్ ఈ సాంగ్‌ను ఎనర్జిటిక్ బీట్‌తో కంపోజ్ చేశారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.