Page Loader
Experium Eco Friendly Park : సినిమా షూటింగ్‌లకు అదే సరైన ప్లేస్: మెగాస్టార్ చిరంజీవి
సినిమా షూటింగ్‌లకు అదే సరైన ప్లేస్: మెగాస్టార్ చిరంజీవి

Experium Eco Friendly Park : సినిమా షూటింగ్‌లకు అదే సరైన ప్లేస్: మెగాస్టార్ చిరంజీవి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2025
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎక్స్ పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ మహా అద్భుతంగా అని , మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ పార్క్‌లో అనేక మొక్కలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పార్క్‌ని ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దినందుకు ఆయన ప్రశంసలు గుప్పించారు. సినిమాల షూటింగ్ లకు ఈ స్థలం ఒక శ్రేష్ఠమైన ప్రాంతంగా ఉంది అని కూడా చిరంజీవి చెప్పారు. కళలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని అభినందించారు చిరంజీవి.

వివరాలు 

చాలా కాలం నుంచి రాందేవ్‌తో నా పరిచయం 

"విలువైన భూమి ఉంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, రాందేవ్ ఆ దారిలో వెళ్లే వ్యక్తి కాదు. ఆయన ఎక్స్‌పీరియం పార్క్‌ని ఏర్పాటు చేసి, హైదరాబాద్‌ నగరానికి విలువైన మొక్కలను తీసుకువచ్చారు. ఆయన ప్యాషన్‌ను అభినందించాల్సిందే. నిజంగా చాలా గొప్ప వ్యక్తి. హైదరాబాద్‌కి ఇలాంటి మొక్కలు తీసుకురావడం అత్యంత అభినందనీయం. రాందేవ్ బిజినెస్ మ్యాన్‌గా కాకుండా, కళాకారుడిగా కనిపించారు" అని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. "రాందేవ్‌తో నా పరిచయం చాలా కాలం నుంచి ఉంది. 2000 సంవత్సరంలోనే రాందేవ్ ఈ పార్క్ గురించి నాకు చెప్పారు.

వివరాలు 

రాందేవ్ ఎప్పుడూ వ్యాపారవేత్తగా ఆలోచించరు

2002 నుంచి నేను కూడా ఆయన దగ్గర నుంచి మొక్కలు తీసుకువస్తున్నాను. మా ఇంట్లో ఉండే చాలా రకాల మొక్కలు, చెట్లు రాందేవ్‌ దగ్గర నుంచి వచ్చినవే. రాందేవ్ ఎప్పుడూ వ్యాపారవేత్తగా ఆలోచించరు. ఆయన పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి. నిజానికి, ఈ 150 ఎకరాలను కమర్షియల్‌గా వాడుకోవచ్చు. కానీ రాందేవ్ అలాంటి వ్యక్తి కాదు. అనేక దేశాల నుంచి కొత్త జాతి మొక్కలను తీసుకొని ఈ పార్క్‌ని నిర్మించారు" అని చిరంజీవి చెప్పారు.

వివరాలు 

రు. లక్ష రూపాయల నుంచి 3.5 కోట్ల రూపాయల విలువ చేసే అరుదైన వృక్షాలు

రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో 150 ఎకరాల్లో రాందేవ్ రావ్ ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్క్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ పార్క్‌లో 85 దేశాల నుంచి దిగుమతి చేసిన 25 వేల జాతుల మొక్కలు ఉన్నాయి. రు. లక్ష రూపాయల నుంచి 3.5 కోట్ల రూపాయల విలువ చేసే అరుదైన వృక్షాలు ఈ పార్క్‌లో ఉన్నాయి. ఆరున్నర సంవత్సరాల పాటు శ్రమించి రాందేవ్ రావ్ ఎక్స్‌పీరియం పార్క్‌ని తీర్చిదిద్దారు.