Dulquer Salmaan: నా పేరుతో ఫేక్ అకౌంట్.. దుల్కర్ సల్మాన్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు (ఫేక్ అకౌంట్స్) సృష్టించడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఈ వ్యవహారంపై హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విటర్) వేదికగా తన పేరుతో కొనసాగుతున్న ఓ ఫేక్ అకౌంట్‌పై ఆయన స్పందించారు. ఆ నకిలీ ఖాతాతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన దుల్కర్.. దాన్ని చూసి ఎవరూ మోసపోవద్దని కోరారు. 'దయచేసి ఆ అకౌంట్‌ను నా అధికారిక ఖాతాగా భావించొద్దు. అందులోని ప్రతి విషయాన్ని నేనే పోస్ట్ చేస్తున్నట్లు భ్రమ కలిగిస్తున్నారు. సినిమాల గురించి, తోటి నటీనటుల గురించి ఇష్టమొచ్చినట్లు అభిప్రాయాలు అందులో రాస్తున్నారు.
వివరాలు
ఎలాంటి స్పందన రాలేదు
చివరికి నా కుటుంబ సభ్యులకు కూడా నా పేరుతో ఫేక్ శుభాకాంక్షలు చెబుతున్నారని దుల్కర్ సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై తాను ఇప్పటికే అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు కూడా దుల్కర్ తెలిపారు.
అయితే ఇప్పటివరకు ఎక్స్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
తన పేరుతో కొనసాగుతున్న నకిలీ ఖాతాను అధికారిక ఖాతాగా భావించి ఎవరూ మోసపోవద్దని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
సినిమాల విషయానికొస్తే..
సినిమాల విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్ ఇటీవల 'ఐ యామ్ గేమ్' (I'm Game) చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.
ప్రస్తుతం ఆయన 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) సినిమాలో నటిస్తున్నారు.
పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.