
Ram Charan: టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మకు ఫ్యాన్స్ ఫిదా.. తొలిసారి పెట్‌తో పాటు విగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఖాతాలో మరో గౌరవనీయమైన కీర్తి కిరీటం చేరింది.
పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' ద్వారా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్ తన క్రేజ్‌ను మరోసారి చాటి చెప్పాడు.. తాజాగా లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మైనపు విగ్రహం స్థాపించిన మూడో టాలీవుడ్ నటుడిగా చరణ్ నిలిచారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన హాజరై కుటుంబంగా ఈ ప్రత్యేక సందర్భాన్ని సంబరంగా మార్చారు.
భారత కాలమానం ప్రకారం మే 10 శనివారం సాయంత్రం చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Details
ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
ఈ సందర్భానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తన మైనపు విగ్రహం పక్కన పోజులిచ్చిన రామ్‌చరణ్... ప్రత్యేక ఆకర్షణగా తన పెంపుడు కుక్క 'రైమ్'తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.
మేడమ్ టుస్సాడ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి ఒక సెలబ్రిటీ మైనపు విగ్రహానికి అతడి పెంపుడు జంతువుతో కూడిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం.
మ్యూజియం నిర్వాహకులు రామ్‌చరణ్‌కి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలియజేసినప్పుడు, చరణ్ తన బొమ్మతో పాటు రైమ్ బొమ్మను కూడా పెట్టాలని ప్రత్యేకంగా సూచించడంతో, టుస్సాడ్స్ వారు ఆ అభ్యర్థనను అంగీకరించి విగ్రహాల కొలతలు తీసుకున్నారు.
Details
మే19న ప్రదర్శనకు ఉంచే అవకాశం
ఆవిష్కరణ సందర్భంగా రైమ్ తన మైనపు రూపాన్ని చూసి కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత సోఫా ఎక్కి చరణ్ పక్కన కూర్చొని ఫోటోలకు స్టైల్‌గా పోజులిచ్చింది.
ఇప్పుడు ఈ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించి, మే 19 నుంచి అక్కడ ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్‌ల మైనపు విగ్రహాలను టుస్సాడ్స్ మ్యూజియాల్లో ఏర్పాటు చేయగా.. ఇప్పుడు ఆ ప్రత్యేక జాబితాలో రామ్‌చరణ్ కూడా చేరారు.