Toxic: 'టాక్సిక్' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న 'తబాహి'
ఈ వార్తాకథనం ఏంటి
పాన్-ఇండియా స్టార్ యశ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'టాక్సిక్' నుంచి తొలి వీడియో పాట 'తబాహి'ని చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. విడుదలైన కొద్ది సేపటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ పాటలో యశ్, కియారా అద్వానీ మధ్య కనిపించిన కెమిస్ట్రీతో పాటు, వారిపై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
వివరాలు
ఆగస్టు 26న విడుదలకు సన్నాహాలు..
ముఖ్యంగా పాటలోని విజువల్స్ ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత బాధ్యతలను రవి బస్రూర్తో పాటు తనిష్క్ బాగ్చీ నిర్వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై యశ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.