
Dhurandhar Shooting: 'ధురంధర్' సినిమా సెట్లో ఫుడ్ పాయిజనింగ్.. 120 మందికి పైగా అస్వస్థత!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న 'ధురంధర్' సినిమా సెట్స్‌లో పెద్ద అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్‌లో పాల్గొన్న దాదాపు 120 మందికి పైగా సినీ కార్మికులు కలుషిత ఆహారం (ఫుడ్ పాయిజనింగ్) తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, అదృష్టవశాత్తు అందరి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన లేహ్‌లో జరుగుతున్న షూటింగ్ సమయంలో వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణాలు తెలుసుకునేందుకు అక్కడి నుంచి ఆహార శ్యాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపించారు.
Details
డిసెంబర్ 5న రిలీజ్
రణ్‌వీర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రం 'ధురంధర్'. దీనికి నేషనల్ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన గతంలో తెరకెక్కించిన 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 డిసెంబర్ 5న విడుదల కానుంది. ప్రస్తుతానికి షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు చిత్రబృందం తెలిపింది.