
దసరా నాలుగవ పాట రిలీజ్: సిన్నప్పటి గ్నాపకాలను యాదికి తెచ్చే పాట
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా నుండి నాలుగవ పాట రిలీజ్ అయ్యింది. ఓ అమ్మలాలో అమ్మలాలో అంటూ సాగే ఈ పాట చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా ఉంది.
తెలంగాణ యాసలో సాగే ఈ పాట, ఒక చిన్ని ప్రేమలేఖ అనుకోవచ్చు. చిన్నతనంలోని అమాయకత్వం పాటలోని ప్రతీ పదంలో కనిపించింది.
నల్లబర్రెక్కి ఊరంతా ఊరేగి బువ్వానీళ్ళు ఇగ మర్సేపోతా, బడిలోనా కూసున్నా, ఏందేందో రాస్తున్నా, సూపియ్యలేక లోపట దాస్తున్నా, అంటూ సాగే మాటలు అందంగా ఉన్నాయి.
వెన్నెల ఎదురైతే చాయ్ లోనా అప్పాలే తిన్నట్టే అన్న ఎక్స్ ప్రెషన్ అతి మధురంగా వినిపించింది. జామాకుల్లో సింతపండు కలిపి కసకసమమని తినడం, సెరువు గట్టుపై మేకపిల్లలా దూకడం వంటి మాటలు చిన్నతనాన్ని గుర్తుచేస్తాయి.
దసరా
పాట చివర్లో ఆసక్తికరంగా కనిపించిన సన్నివేశం
ఈ పాటకు సాహిత్యాన్ని రెహమాన్ అందించగా, అనురాగ్ కులకర్ణి గొంతునందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. పాట చివర్లో, ట్రైలర్ చివర్లో కనిపించిన సన్నివేశాన్ని చూపించారు.
దాంతో ఆ సన్నివేశం, సినిమాకు హైలైట్ గా ఉండనుందని అనుకుంటున్నారు. ఇప్పటివరకు దసరా నుండి నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇంకో పాట రిలీజ్ చేయాల్సి ఉంది.
కానీ ఆ పాటను రిలీజ్ చేయట్లేదని దసరా టీమ్ తెలియజేసింది. ఆ పాటలో సినిమా కథ మొత్తం ఉంటుందని, అందుకనే రిలీజ్ చేయట్లేదని నాని అన్నాడు.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో రూపొందిన దసరా సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దసరా సినిమా నుండి నాలుగవ పాట రిలీజ్
Dharani, Vennela and their beautiful childhood 😍#DasaraFourthSingle out now ❤️
— SLV Cinemas (@SLVCinemasOffl) March 28, 2023
- https://t.co/65CDFX1WmD#Dasara Grand Release on March 30th.
Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/tIl8TCbPGR