దసరా ప్రమోషన్స్: రావణాసురుడుతో ముచ్చట, బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు
నేచురల్ స్టార్ నాని, దసరా మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఇండియా మొత్తం దసరా ను ప్రమోట్ చేయడానికి తిరుగుతూనే ఉన్నాడు. రోజుకో సిటీ చొప్పున కాళ్ళకు చక్రాలు కట్టుకుని చకచకా తిరిగేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో దసరా సినిమాకు చేస్తున్న ప్రమోషన్స్, మరే సినిమాకు చేయలేదు. ఈ ప్రమోషన్స్ కూడా చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. తాజాగా హీరో రవితేజను కలిసిన నాని, ఇటు దసరా ముచ్చట్లతో పాటు అటు రావణాసుర ముచ్చట్లను మన ముందుకు తీసుకువస్తున్నాడు. రవితేజ, నాని మాట్లాడుకున్న డిస్కషన్ ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది. ప్రస్తుతం చిన్నపాటి ప్రోమో విడుదలైంది. అందులో అటు దసరా, ఇటు రావణాసుర సినిమాల గురించిన ఆసక్తికర మాటలున్నాయి.
తెలంగాణ యాస, డైలాగులపై నాని, రవితేజ ముచ్చట్లు
దసరా ట్రైలర్ లో, మొలదారం కింద గుడాల్ రాల్తాయ్ అనే డైలాగ్ చెప్తాడు నాని. దానికర్థం నానికి కూడా తెలియదంట. అదేంటని దర్శకుడు శ్రీకాంత్ ని అడిగాక అర్థమైందని, ఆ డైలాగ్ అర్థాన్ని రవితేజతో పంచుకున్నాడు నాని. అలాగే, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు, ఇప్పటివరకు ఎవ్వరితో పంచుకోని కొన్ని విషయాలను అందులో నాని పంచుకున్నాడు. తెలంగాణ యాస గురించి ఇద్దరూ మాట్లాడుకుంటూ, వాల్తేరు వీరయ్య సినిమాను గుర్తు చేసుకున్నాడు రవితేజ. నా ఆటోగ్రాఫ్, నేనింతే వంటి సినిమాలు ఎందుకు వర్కౌట్ కాలేదనే విషయాన్ని రవితేజ, నానితో పంచుకున్నాడు. ఈ ముచ్చటకు సంబంధించిన పూర్తి వీడియో, ఈరోజు సాయంత్రం 4:05గంటలకు రిలీజ్ అవుతుందని ప్రకటించాడు నాని.