LOADING...
Nani: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరో వరకూ.. 'నాని' సినీ ప్రయాణం ఇదే!
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరో వరకూ.. 'నాని' సినీ ప్రయాణం ఇదే!

Nani: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరో వరకూ.. 'నాని' సినీ ప్రయాణం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మన పక్కింటి కుర్రాడిలా..' అనే వ్యాఖ్య సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తుంది. కానీ కొంతమంది నటులను చూస్తే పక్కింటి కుర్రాడు కాదు.. మన ఇంటి అబ్బాయే అన్న భావన కలుగుతుంది. అలాంటి సహజత్వం, ఆప్యాయత, నిజాయితీ కలగలిపిన నటుడు 'నాని'. పెట్ నేమ్‌తోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి, అదే పేరుతో స్టార్‌గా ఎదిగిన అరుదైన నటుడు నాని. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించినవారు సాధారణంగా దర్శకులవుతారు. కానీ నాని మాత్రం హీరోగా మారి, తనదైన శైలితో టాలీవుడ్‌లో ప్రామిసింగ్ స్టార్‌గా నిలిచాడు. మీడియం రేంజ్ సినిమాలతో మొదలై, కమర్షియల్ సినిమాలకు 'మినిమమ్ గ్యారంటీ' హీరోగా మారాడు. ఈరోజు నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణం మరోసారి గుర్తుకు వస్తోంది.

Details

18 ఏళ్ల హీరో ప్రయాణంలో మంచి నటుడిగా గుర్తింపు

2008లో అష్టా చెమ్మాతో కూల్ లుక్స్‌లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న నాని, ఇన్నేళ్లలో కామెడీ, సెంటిమెంట్, యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు ఇలా విభిన్న జానర్లలో నటించి తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నాడు. సహజ నటనతో దక్షిణాది భాషల్లోనూ అభిమానులను సంపాదించాడు. నిర్మాతలకు నష్టాలు రానీయకుండా, మినిమమ్ కలెక్షన్లతో 'కొంగు బంగారం'గా మారాడు. కొత్త దర్శకులకు ఆశగా, కొత్త కథలకు చిరునామాగా నిలిచాడు. 18 ఏళ్ల హీరో ప్రయాణంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఎంత బిజీగా ఉన్నా, సినిమా మేకింగ్‌పై నానిలోని తపన తగ్గలేదు. ఎప్పుడో ఒకరోజు మెగాఫోన్ పట్టి తనలోని దర్శకుడిని బయటకు తీసుకొస్తాడన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.

Details

ప్రస్తుతం 'ప్యారడైజ్' మూవీతో బిజీ

ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కారణంగా దర్శకత్వం సాధ్యంకాకపోయినా, సినిమా నిర్మాణంపై దృష్టి సారించాడు. నిర్మాతగా మారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. క్రియేటివ్ మైండ్ కలిగిన హీరోగా, మేకింగ్‌లోనూ తన ముద్ర వేయడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే నాని వర్సటైల్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, పూర్తి స్థాయి 'ఫిల్మీ మ్యాన్'. ఇప్పటివరకు 38 సినిమాలతో తన మార్క్‌ను నిరూపించుకున్న నాని, ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాన్ ఇండియా స్థాయిలో 'ప్యారడైజ్' చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే సుజీత్ దర్శకత్వంలో మరో విభిన్న కథా చిత్రానికి సిద్ధమవుతున్నాడు. తెలుగు తెరపై మరెన్నో అద్భుతాలు సృష్టించాలని ఆశిస్తూ.. నేచురల్ స్టార్ నానికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

Advertisement