Jagga Reddy: రాజకీయ నాయకుడి నుంచి నటుడిగా.. 'జగ్గారెడ్డి' ఫస్ట్ లుక్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయ రంగం నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.
ఇప్పటివరకు నటీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం సాధారణంగా కనిపించినా, ఆయన మాత్రం విభిన్నంగా సినిమాల్లోకి రాబోతున్నారు.
తాజాగా 'జగ్గారెడ్డి - ఏ వార్ ఆఫ్ లవ్' సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారనే విషయాన్ని ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పూర్తి స్థాయిలో సినిమాల్లోకి రానున్నానని చెప్పారు.
Details
ఉగాదికి రిలీజ్
'జగ్గారెడ్డి - ఏ వార్ ఆఫ్ లవ్'లో తన ఒరిజినల్ క్యారెక్టర్‌ను ప్రతిబింబించేలా ఉందని, అందుకే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించానని తెలిపారు.
పీసీసీ, సీఎం అనుమతితోనే సినిమాల్లోకి వచ్చానని, ఈ సినిమా వచ్చే ఉగాదికి విడుదల కానుందని తెలిపారు.
తన పాత్రకు సరిపోయే కథతో ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి ఒప్పించాడని దీంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని జగ్గారెడ్డి తెలిపారు.
ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ సహా పాన్-ఇండియా భాషల్లో విడుదల కానుంది.