Page Loader
Genelia : జాన్‌ అబ్రహాంతో పెళ్లి పుకార్లు కావాలనే సృష్టించారు : జెనీలియా సంచలన వ్యాఖ్యలు
జాన్‌ అబ్రహాంతో పెళ్లి పుకార్లు కావాలనే సృష్టించారు : జెనీలియా సంచలన వ్యాఖ్యలు

Genelia : జాన్‌ అబ్రహాంతో పెళ్లి పుకార్లు కావాలనే సృష్టించారు : జెనీలియా సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అందం, చలాకీ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న నటి జెనీలియా తిరిగి ఫోకస్‌లోకి వచ్చారు. కెరీర్ పీక్‌ స్టేజ్‌లోనే వివాహం చేసుకుని, సినిమాలకు కొంత గ్యాప్‌ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మళ్లీ తెరపై తన సత్తా చూపించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతానికి ఆమె ఎంపిక చేసిన ప్రాజెక్టులు సెలెక్టివ్‌గా ఉండగా, అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'సితారే జమీన్ పర్' అనే చిత్రం ద్వారా మరోసారి తెరపై దర్శనమివ్వనున్నారు. ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా జెనీలియా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

Details

రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న జెనిలియా

సుమారు 14 ఏళ్ల క్రితం జాన్ అబ్రహామ్‌తో తాను పెళ్లి చేసుకున్నట్లుగా వచ్చిన గాసిప్స్ గురించి ఆమె స్పందించారు. 'ఆ వార్తలు అవాస్తవం. అప్పుడు మా పెళ్లి సెట్లలో జరిగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఆ కథనాల వెనుక ఉన్నవారు ఎవరో నాకు బాగా తెలుసు కూడా. కానీ, వాళ్లు అలా ఎందుకు చేశారు అనేది మాత్రం ఇప్పటికీ అర్థం కాలేదంటూ స్పష్టతనిచ్చారు. అయితే, ఆ రూమర్లకు ఏడాదిలోనే క్లారిటీ వచ్చింది. జెనీలియా బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకొని తన వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి కుటుంబంతో ఆనందంగా జీవిస్తున్న ఆమె, మరోసారి నటిగా రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టి తెరపై తళుక్కుమంటోంది. జెనీలియా ప్రస్తుతం మంచి క్రేజ్‌తో ముందుకు సాగుతోంది.