Loading...
Bloody Romeo : నాని సరసన గ్లామరస్‌ బ్యూటీ.. 'బ్లడీ రోమియో'లో మీనాక్షి చౌదరి?
నాని సరసన గ్లామరస్‌ బ్యూటీ.. 'బ్లడీ రోమియో'లో మీనాక్షి చౌదరి?

Bloody Romeo : నాని సరసన గ్లామరస్‌ బ్యూటీ.. 'బ్లడీ రోమియో'లో మీనాక్షి చౌదరి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

'సాహో', 'OG' వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు సుజీత్, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లడీ రోమియో'. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్‌పై నాని, వెంకట్ బోయినపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టైలిష్ విజువల్స్‌తో పాటు నాని సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ క్రేజీ అప్‌డేట్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నాని సరసన గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వివరాలు

అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం?

ఇక మలయాళ వర్సటైల్ స్టార్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా 'బ్లడీ రోమియో'లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. పృథ్వీరాజ్ వంటి క్రేజీ నటుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నాడనే వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

'బ్లడీ రోమియో' సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ముందుగా హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

అనంతరం లండన్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లండన్‌లో చిత్రీకరించనున్న సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని టాక్.

ఈ చిత్రంలో నాని ఇప్పటివరకు చూడని విధంగా సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను అలరించనున్నారని తెలుస్తోంది.

డిఫరెంట్ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం.

వివరాలు

ముగ్గురు సంగీత దర్శకులు?

'బ్లడీ రోమియో'ను పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు సంగీత దర్శకులు కలిసి పనిచేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే ఈ విషయంపై కూడా చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT