Loading...
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ 'పౌర్ణమి' పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి అదుర్స్!
డార్లింగ్ ప్రభాస్ 'పౌర్ణమి' పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి అదుర్స్!

Pournami Song: డార్లింగ్ ప్రభాస్ 'పౌర్ణమి' పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి అదుర్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా పాటలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న వేళ.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఓ పాట మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన 'పౌర్ణమి' సినిమాలోని 'భరత వేదముగా' పాట ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఈ పాటకు చైనీస్‌ డ్యాన్సర్‌ మీరా వాంగ్‌ టోక్యోలో ఇచ్చిన అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'భరత వేదముగా' పాటకు మీరా వాంగ్‌ కూచిపూడి నృత్యం చేసిన తీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. తెలుగు పాటకు అనుగుణంగా సంప్రదాయ నృత్య భంగిమలను ఆమె ప్రదర్శించడంతో ఈ వీడియోపై నెటిజన్లు ప్రత్యేకంగా స్పందిస్తున్నారు.

వివరాలు

విదేశీయులను ఆకర్షిస్తున్న పాట

భాష తెలియకపోయినా సంగీతం, సాహిత్యం, నృత్యం ద్వారా తెలుగు సినిమా పాటలు విదేశీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయనడానికి ఈ ప్రదర్శన మరో ఉదాహరణగా నిలుస్తోంది.

'పౌర్ణమి' చిత్రంలోని ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా..ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.

చిత్ర పాడిన గానం కూడా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 20ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాటకు ఇప్పుడు ఓ విదేశీ కళాకారిణి తన నృత్యంతో సరికొత్త రూపాన్ని ఇవ్వడంతో మరోసారి వైరల్‌గా మారింది.

మీరా వాంగ్‌కు భారతీయ శాస్త్రీయ నృత్యాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది.

ఆమె భారత్‌కు రాకుండానే అనంతపురానికి చెందిన అలా వెంకట గోపాల్‌ వద్ద కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నట్లు సమాచారం.

వివరాలు

ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

గతంలోనూ ఆమె పలు తెలుగు సినిమా పాటలకు తన నృత్య ప్రతిభను ప్రదర్శించింది.

ముఖ్యంగా క్లాసిక్‌ మూవీ 'మాయాబజార్‌'లోని 'ఆహా నా పెళ్లంట' పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌ అప్పట్లో వైరల్‌గా మారింది.

ఇప్పుడు టోక్యో వేదికగా 'భరత వేదముగా' పాటకు ఆమె చేసిన కూచిపూడి ప్రదర్శన మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తెలుగు భాష తెలియకపోయినా సంగీతం, సాహిత్యం, నృత్యం ద్వారా తెలుగు సినిమా పాటలు అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువవుతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ పాట.. ఓ చైనీస్‌ డ్యాన్సర్‌ ప్రదర్శనతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు రావడంపై తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT