Loading...
AA 23 Update: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'AA 23'పై త్వరలోనే ఆసక్తికర అప్‌డేట్స్‌!
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'AA 23'పై త్వరలోనే ఆసక్తికర అప్‌డేట్స్‌!

AA 23 Update: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'AA 23'పై త్వరలోనే ఆసక్తికర అప్‌డేట్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక్క ఫోటో.. సోషల్ మీడియాలో సాగుతున్న వందలాది ఊహాగానాలకు తెరదించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్‌ అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదని, సినిమా వాయిదా పడుతోందని రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ ప్రచారాలన్నింటికీ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

వివరాలు

అల్లు అర్జున్‌తో లోకేష్‌ ఫోటో.. త్వరలోనే అప్‌డేట్స్‌!

అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటోను లోకేష్‌ కనగరాజ్‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి "ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌ త్వరలోనే రానున్నాయంటూ క్యాప్షన్‌ జతచేశారు.

అంతేకాదు.. ఈ సినిమాను నిర్మించనున్న మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ను కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ముందుకు సాగుతోందనే సంకేతాలు ఇచ్చారు.

ఆ ఫొటోలో అల్లు అర్జున్‌, లోకేష్‌ కనగరాజ్‌ ఇద్దరూ సీరియస్‌గా కథా చర్చల్లో మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. దీంతో సినిమా వాయిదా పడుతోందంటూ వచ్చిన వార్తలపై అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది.

అయితే సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇతర వివరాలేమిటనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వివరాలు

అల్లు అర్జున్‌ - లోకేష్‌ కాంబోపై భారీ అంచనాలు!

'పుష్ప' సినిమాతో పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది.

మరోవైపు తనదైన రా అండ్ రస్టిక్ యాక్షన్‌ మేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్‌ కనగరాజ్‌ తన సినిమాలతో ప్రత్యేకమైన సినిమాటిక్‌ యూనివర్స్‌ను నిర్మించారు.

ఈ ఇద్దరి కలయికలో సినిమా రానుందనే వార్త అభిమానుల్లో మొదటి నుంచీ భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దీనికి తోడు సంగీత సంచలనం అనిరుధ్‌ రవిచందర్‌ ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందించనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

ఆయన అందించే హై-వోల్టేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

త్వరలోనే అధికారిక ప్రకటన?

ఇప్పటివరకు ప్రాజెక్ట్‌ గురించి చక్కర్లు కొడుతున్న పలు ఊహాగానాలకు లోకేష్‌ కనగరాజ్‌ తన సోషల్ మీడియా పోస్ట్‌తో సమాధానమిచ్చారు.

మాటలతో స్పందించడం కంటే అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఒక్క ఫొటోను పంచుకోవడం ద్వారా సినిమా పనులు ముందుకు సాగుతున్నాయనే సంకేతాలిచ్చారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్‌, షూటింగ్‌ షెడ్యూల్‌ లేదా ఇతర కీలక వివరాలపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

అయితే తదుపరి అప్‌డేట్‌ ఎప్పుడు వస్తుందనే దానిపై చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT