The Paradise : నాని అభిమానులకు గుడ్ న్యూస్.. 'ది ప్యారడైజ్' నుంచి సూపర్ అప్‌డేట్
ఈ వార్తాకథనం ఏంటి
'దసరా' వంటి ఊరమాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్'పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ దశ నుంచే హైప్‌ను సొంతం చేసుకుంది. అయితే షూటింగ్ ఆలస్యంతో మొదట ప్రకటించిన మార్చి విడుదల తేదీని మార్చి, ఇప్పుడు ఆగస్టు 21, 2026కి వాయిదా వేశారు. రిలీజ్ వాయిదా కారణంగా నిరాశ చెందిన అభిమానులకు తాజాగా చిత్రబృందం ఓ సరికొత్త అప్‌డేట్ ఇచ్చింది ఈ సినిమాలోని ప్రతిష్టాత్మక ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
Details
ఫిబ్రవరి 24న రిలీజ్
రాక్‌స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. అనిరుధ్ మార్క్ బీట్‌లతో రాబోతున్న ఈ పవర్‌ఫుల్ సాంగ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ కొనసాగుతున్న ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖ్యంగా కలెక్షన్ కింగ్‌గా పేరుగాంచిన మోహన్ బాబు ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే సోనాలి కులకర్ణి, తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.