The Paradise: నాని 'ది ప్యారడైజ్'కు గుడ్‌న్యూస్.. టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'ది ప్యారడైజ్'కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వాలని చిత్ర బృందం చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
వివరాలు
సెప్టెంబర్ 23న స్పెషల్ ప్రీమియర్స్
సినిమా విడుదలకు ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ ప్రీమియర్ షోలకు టికెట్ ధరలను మల్టీప్లెక్స్‌లలో రూ.400, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.300గా నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
10 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు
ఇక సినిమా విడుదలైన తర్వాత తొలి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుంది.
ఈ కాలంలో మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.
వివరాలు
రోజుకు ఐదు షోలకు అనుమతి
టికెట్ ధరల పెంపుతో పాటు 'ది ప్యారడైజ్' చిత్రాన్ని రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.
ప్రత్యేక ప్రీమియర్లు, పెంచిన టికెట్ ధరలు, రోజుకు ఐదు షోలకు లభించిన అనుమతులతో సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.