
ప్రభాస్ అభిమానులకు ఖతర్జాక్ అప్డేట్: బర్త్ డే కానుకగా ట్రీట్ రాబోతుంది
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ అభిమానులంతా ప్రస్తుతం సలార్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీన సలార్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో, సలార్ సినిమా నుండి ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23నాడు ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు అనుకుంటున్నారు.
ఇప్పటివరకు సలార్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి మంచి ఎలివేషన్ ఇచ్చారు. కానీ ప్రభాస్ లుక్ మాత్రం చూపించలేదు.
అందుకే, ప్రభాస్ పుట్టినరోజున ఏదైనా గ్లింప్స్ రిలీజైతే ప్రభాస్ లుక్ చూద్దామని ఎదురుచూస్తున్నారు. సలార్ టీమ్ నుండి గ్లింప్స్ విషయమై ఎలాంటి అప్డేట్ రాలేదు.
దాని గురించి పక్కన పెడితే, ప్రభాస్ పుట్టినరోజున ఛత్రపతి సినిమా రీ రిలీజ్ అవుతుంది.
Details
4కే వెర్షన్ లో ఛత్రపతి రీ రిలీజ్
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఛత్రపతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాను మళ్ళీ విడుదల చేయబోతున్నారు.
4కే వెర్షన్ లో థియేటర్లలోకి మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా అప్డేట్ వచ్చింది. ఛత్రపతి సినిమా మళ్ళీ విడుదల అవుతుండడంతో అభిమానులంతా హ్యాపీగా ఉన్నారు.
ఛత్రపతి సినిమాలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించారు. సీనియర్ హీరోయిన్ ప్రియమణి అమ్మ పాత్రలో కనిపించారు. షఫీ, అజయ్, ప్రదీప్ రావత్, వేణు మాధవ్ ఇతర పాత్రల్లో నటించారు.
అదలా ఉంచితే, ప్రభాస్ చేతిలో ప్రస్తుతం కల్కి 2898 AD, స్పిరిట్, రాజా డీలక్స్ చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో కల్కి 2898 AD చిత్రం 2024 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.