Rashmika Mandanna: రష్మిక ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'మైసా' రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
నటి రష్మిక మందన్న అభిమానులకు చిత్రబృందం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం మంగళవారం ప్రకటించింది. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. సోషల్ మీడియా వేదికగా రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్.. రష్మికను ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త రూపంలో ప్రేక్షకులు చూడబోతున్నారని తెలిపారు.
వివరాలు
అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి
ఇటీవల 'మైసా' కోసం కీలకమైన అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రబృందం పూర్తి చేసింది. రష్మిక పాల్గొన్న ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని నిర్మాత అజయ్ సాయిపురెడ్డి కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే కేరళలో సినిమాకు సంబంధించిన సుదీర్ఘ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.
ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. స్టంట్ మాస్టర్ కెచా ఖంపక్డీ వీటికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు.
రష్మిక కూడా ఈ యాక్షన్ సన్నివేశాల్లో కీలకంగా పాల్గొన్నట్లు సమాచారం.
వివరాలు
గిరిజన యువతి పాత్రలో రష్మిక
'మైసా'లో రష్మిక గిరిజన గోండ్ యువతి పాత్రలో కనిపించనున్నారు.
భావోద్వేగాలతో పాటు శారీరకంగా కఠినమైన యాక్షన్ సన్నివేశాలు చేయాల్సిన పాత్ర కావడంతో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్వహించిన స్టంట్, కంబాట్ బూట్‌క్యాంప్‌లో రష్మిక శిక్షణ పొందారు.
రోజుకు ఎనిమిది గంటలకు పైగా సాధన చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది.
వివరాలు
భారీ తారాగణం
ఈ సినిమాలో ఈశ్వరీరావు, గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శ్రేయాస్ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు.
భారీ యాక్షన్ సన్నివేశాలు, రష్మిక సరికొత్త పాత్ర, అండర్‌వాటర్ యాక్షన్ ఎపిసోడ్‌లతో రూపొందుతున్న 'మైసా' నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.