Loading...
Rajinikanth: తలైవా అభిమానులకు గుడ్‌న్యూస్.. రజనీకాంత్ ఆత్మకథపై కీలక అప్‌డేట్!
తలైవా అభిమానులకు గుడ్‌న్యూస్.. రజనీకాంత్ ఆత్మకథపై కీలక అప్‌డేట్!

Rajinikanth: తలైవా అభిమానులకు గుడ్‌న్యూస్.. రజనీకాంత్ ఆత్మకథపై కీలక అప్‌డేట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందాయి. ఒకవైపు ఆయన ఆత్మకథ త్వరలోనే విడుదల కానుండగా.. మరోవైపు ఆయన నటించిన 'జైలర్ 2' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఏడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు తాజాగా రజనీకాంత్‌తో జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తలైవా తన జీవిత చరిత్రపై పనిచేస్తున్నట్లు చెప్పారని, ఆ పుస్తకం తమిళంతో పాటు ఇంగ్లిష్‌లోనూ విడుదలయ్యే అవకాశం ఉందని వైరముత్తు వెల్లడించారు.

వివరాలు

రజనీ ఆత్మకథ ఎప్పుడు వస్తుందంటే?

'జైలర్ 2' విడుదల సందర్భంగా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయనను కలిసినట్లు వైరముత్తు తన 'ఎక్స్‌' (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.

ఈ భేటీలో తామిద్దరం కళ, జీవితం వంటి అంశాల గురించి మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రస్తావన మాత్రం రాలేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రజనీకాంత్‌ను ఉద్దేశించి.. ''మీ ఆత్మకథ ఎప్పుడు వస్తుంది?'' అని తాను అడిగినట్లు వైరముత్తు తెలిపారు.

అందుకు రజనీ స్పందిస్తూ.. ''పనులు జరుగుతున్నాయి. త్వరలోనే వస్తుంది'' అని చెప్పినట్లు వెల్లడించారు.

అలాగే 'చాలామందికి చరిత్ర ఉంటుంది. కానీ మీకు చరిష్మా కూడా ఉంది. అందుకే మీ ఆత్మకథ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు'' అని తాను రజనీకాంత్‌తో చెప్పినట్లు వైరముత్తు వివరించారు.

వివరాలు

అక్టోబర్ 15న 'జైలర్ 2' విడుదల

దీంతో సూపర్ స్టార్ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల్లో ఆయన ఆత్మకథపై ఆసక్తి మరింత పెరిగింది.

ఈ పుస్తకం తమిళంతో పాటు ఇంగ్లిష్‌లోనూ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జైలర్ 2' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఈ సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ADVERTISEMENT

వివరాలు

అభిమానుల్లో ఆసక్తి

ట్రైలర్‌ను బట్టి చూస్తే.. టైగర్ ముత్తువేల్ పాండియన్‌ను పట్టుకునేందుకు విలన్లు ప్రయత్నిస్తుంటారు.

అయితే వారి ప్రయత్నాలను ఎదుర్కొంటూ శత్రువుల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ముత్తువేల్ పాండియన్ డ్రైవర్‌గా అండర్‌కవర్‌లో వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

  ట్రైలర్‌లో పవర్‌ఫుల్ డైలాగ్ హైలైట్

'జైలర్ 2'లో రజనీకాంత్‌తో పాటు ఎస్.జె. సూర్య, విద్యా బాలన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వీరి పాత్రలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో రజనీకాంత్ చెప్పిన ఓ పవర్‌ఫుల్ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

''అవన్నీ మీ నాన్న కాలం నాటి స్టైల్. ఇప్పుడు శత్రువులందరినీ ఒకేచోటకు చేర్చి బాంబుతో పేల్చేయడమే కొత్త ట్రెండ్'' అంటూ ఆయన చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఒకవైపు త్వరలో విడుదల కానున్న రజనీకాంత్ ఆత్మకథపై ఆసక్తి నెలకొనగా.. మరోవైపు అక్టోబర్ 15న విడుదల కానున్న 'జైలర్ 2' కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

దీంతో తలైవా అభిమానులకు ఈ రెండు వార్తలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

ADVERTISEMENT