Page Loader
Kiara Advani : రెండేళ్లు సినిమాలకు గుడ్‌బై.. స్టార్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్!
రెండేళ్లు సినిమాలకు గుడ్‌బై.. స్టార్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్!

Kiara Advani : రెండేళ్లు సినిమాలకు గుడ్‌బై.. స్టార్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కథానాయికల ఆలోచన విధానంలో భారీ మార్పు కనిపిస్తోంది. కెరీర్ పీక్‌లో ఉన్నా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెళ్లి, పిల్లల విషయంలో ముందడుగు వేస్తున్నారు. ఒకప్పుడు వివాహం చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయనే భావనతో, 30 ఏళ్లు దాటే వరకు పెళ్లి గురించి ఆలోచించని హీరోయిన్లు, ఇప్పుడు మాత్రం ఆ మైండ్‌సెట్‌ను మార్చుకున్నారు. చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టి, కొద్దిరోజుల్లోనే శుభవార్తను పంచుకుంటున్నారు. ఈ కోవలోనే బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా కూడా తమ కుటుంబంలో కొత్త సంతోషాన్ని పంచుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట, త్వరలో తల్లిదండ్రులు కానున్నట్లు సంతోషంగా ప్రకటించారు.

Details

 డాన్-3 నుంచి తప్పుకున్న కియారా అద్వానీ 

ఇండస్ట్రీలో కియారా తన భర్త కన్నా ఎక్కువ పాపులారిటీ సాధించిన నటి అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేతిలో బహుళ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నా, తల్లి కాబోతున్న నేపథ్యంలో కొన్ని సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన చిత్రాలు మినహాయిస్తే, మిగతా సినిమాల నుంచి వైదొలిగింది. అంతేకాదు త్వరలో ప్రారంభం కానున్న 'డాన్ 3' సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీ మరో రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉండనుంది. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత రీ-ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటుందని ఆమె టీం వెల్లడించింది.