Allu Arjun: అల్లు అర్జున్ నివాసంలో గ్రాండ్ పార్టీ.. హాజరైన రామ్‌చరణ్ దంపతులు
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అల్లు శిరీష్-నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతుండగా, తాజాగా అల్లు అర్జున్ తన నివాసంలో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు రామ్ చరణ్ దంపతులతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. ఈ పార్టీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల గోవాలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ కూడా నిర్వహించుకున్నారు. ఆ వేడుకలో స్నేహితులతో కలిసి సందడి చేశారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు, సినీ స్నేహితుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం విశేషం.
Details
ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం
గతేడాది అక్టోబర్‌లో శిరీష్ తన ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం జరుపుకున్నారు. వివాహానికి సంబంధించిన పిలుపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తాజాగా తొలి శుభలేఖను శిరీష్ తన మావయ్య, అగ్ర కథానాయకుడు చిరంజీవికు అందజేసి ఆశీర్వాదాలు పొందారు. మార్చి 6న జరగనున్న ఈ వివాహ వేడుక కోసం అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.