
Venkatesh: వెంకీ మామ నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్.. త్రివిక్రమ్ కథతో సినిమా స్టార్ట్?
ఈ వార్తాకథనం ఏంటి
చిత్ర పరిశ్రమలో అభిమానులు ఏ హీరోకి ఉన్నా సరే, విక్టరీ వెంకటేష్ సినిమాలంటే అందరికీ ఓ ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది.
కుటుంబ కథాంశాలు, ప్రేమ, హాస్యంతోపాటు అందరినీ అలరిస్తూ 'వెంకీ మామ'గా ప్రేక్షకుల మనసుల్లో స్థిరమైన స్థానం సంపాదించారు.
ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఘన విజయం సాధించింది.
ఈ చిత్రం రూ.300 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టి సినీ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటించారు.
Details
ఇప్పటికే 20పైగా కథలు విన్న వెంకీ
ఈ అపూర్వ విజయంతో మళ్లీ సంక్రాంతికి అదే టైటిల్‌తో కొనసాగింపుగా మరో సినిమాను రూపొందించనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
ప్రాంతీయ సినిమా గానే విడుదలై ఈ స్థాయి గ్రాస్ వసూళ్లను సాధించడమే వెంకటేష్ సత్తా ఏంటో మరోసారి నిరూపించడంతో ఆయన తదుపరి సినిమా పట్ల ఉత్కంఠ పెరిగింది.
అదే ఉత్సాహంతో ప్రస్తుతం వెంకటేష్ పూర్తిగా కొత్త కథల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన 20కి పైగా కథలు విన్నారని సమాచారం.
ఇందులో భాగంగా ఆయన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో భేటీ అయినట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Details
త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం
గతంలో వెంకటేష్ హీరోగా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్', మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరోసారి సినిమా కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
అయితే గతంలో వీరిద్దరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినా అది ప్రాక్టికల్‌గా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారినట్లు కనిపిస్తోంది.
త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సి ఉంది.
అయితే స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కాకపోవడంతో బన్నీ ముందుగా అట్లీ సినిమాకి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
Details
నువ్వునాక్ నచ్చావ్ స్టైల్ లో మూవీ
ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ వెంకటేష్‌తో సినిమా పూర్తిచేయాలనుకుంటున్నారని సమాచారం.
ఇప్పటికే ఇద్దరూ రెండు మూడు సార్లు స్టోరీ డిస్కషన్స్ నిర్వహించారని, 'నువ్వు నాకు నచ్చావ్' స్టైల్‌లో ఓ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసినట్టు టాక్ ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
అంతేకాకుండా ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
ఇటీవల 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌తో తన నటనకు పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్, ఈ సినిమాతో పెద్ద స్థాయిలో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంచనాలు వినిపిస్తున్నాయి.