Guntur Kaaram OTT: ఓటీటీలోకి 'గుంటూరు కారం.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే!
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ డ్రామాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్‌ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. ఈ మేరకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న తమ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు 'నెట్‌ఫ్లిక్స్' ప్రకటించింది. 'నెట్‌ఫ్లిక్స్'లో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, ఈశ్వరీ రావు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. శ్రీలీల కథానాయికగా నటించింది.