
ప్రభాస్ సినిమా నుండి పక్కకు తప్పుకున్న ఇస్మార్ట్ హీరోయిన్?
ఈ వార్తాకథనం ఏంటి
బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్, సాహో, రాధేశ్యామ్ సినిమాల ద్వారా డిజాస్టర్లు మూటకట్టుకున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ నుండి వరుసగా సినిమాలు రానున్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు ఆల్రెడీ సెట్స్ మీదున్నాయి. ఈ మూడింటి మధ్యలో మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది.
రాజా డీలక్స్ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమాపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు గానీ సినిమా చిత్రీకరణ మాత్రం సాగుతుందని అంటున్నారు.
దాదాపు 15 రోజుల పాటు ప్రభాష్ షూటింగ్ లో కూడా పాల్గొన్నాడట. ఐతే ఈ సినిమా నుండి ఒక హీరోయిన్ ని తప్పిస్తున్నట్లు లీకులు వస్తున్నాయి.
ప్రభాస్
ముగ్గురిలోంచి ఇస్మార్ట్ హీరోయిన్ పక్కన పెడుతున్నారు
ఈ సినిమాలో మొదట మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ని తీసుకున్నట్లు వినికిడి. 15రోజుల షూటింగ్ తర్వాత ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ సెట్ అవట్లేదని మారుతి ఫీల్ అయ్యాడట.
అందుకే ఆమెను పక్కకు తప్పించేందుకు చర్చలు కూడా చేసాడట. మొత్తానికి నిధి అగర్వాల్ ని తీసేసారని వినిపిస్తోంది.
నిధి అగర్వాల్ స్థానంలో మరో హీరోయిన్ కోసం ప్రస్తుతం వెతుకుతున్నారట. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను అనుకున్నట్లు, అందులో మెహరీన్ కూడా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
మరి నిధి స్థానంలో ప్రభాస్ పక్కన నటించే ఆవకాశం ఎవరికి వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ ని తీసేయడం వెనక ఏవో ప్రత్యేక కారణాలున్నాయని కూడా చెవులు కొరుక్కుంటున్నారు.