Kannada actress: వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు.. కన్నడ నటిని బ్లాక్‌మెయిల్ చేసిన దుండగులు
ఈ వార్తాకథనం ఏంటి
ఒక కన్నడ నటి (Kannada actress)కి తీవ్ర షాక్ ఇచ్చే ఘటన వెలుగులోకి వచ్చింది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ దృశ్యాలతో తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల కోరమంగళ ఇండోర్ స్టేడియంలో సెలబ్రిటీ విమెన్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ మ్యాచ్‌లకు ఆ నటి హాజరయ్యారు. టోర్నీలో భాగంగా రెండో రోజు స్టేడియంలోని రెస్ట్‌రూమ్‌ను ఉపయోగించినట్లు ఆమె తెలిపారు.
Details
ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు
రెస్ట్‌రూమ్‌లో ఎవరో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి, అశ్లీల వీడియోలు తీశారు. ఆ వీడియోలను ఆధారంగా తీసుకుని నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వాటిని విడుదల చేస్తామని బెదిరింపులు చేస్తున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ఆమె పోలీసులకు సమర్పించారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతోంది.